మీడియా ఎఫెక్ట్.. ప్రత్యర్థులు అప్రమత్తం?

Posted By: Super

మీడియా ఎఫెక్ట్.. ప్రత్యర్థులు అప్రమత్తం?

 

భవిష్యత్తులో రాబోతున్న ఆపిల్ ఐఫోన్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంటుందని ఓ సౌత్ కొరియన్ మీడియా సంచలన కధనాన్ని ప్రచురించింది. ఈ వార్త వెలుగులోకి రావటంతో ఆపిల్ ప్రత్యర్ధి కంపెనీలు అప్రమత్తమైనట్లు  సమాచారం.  ఇటీవల విడుదలైన ఆపిల్ కొత్త ఐప్యాడ్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉండటంతో విపరీతమైన ఆదరణ ఏర్పడింది. ఆపిల్ మొదటి ఐఫోన్ 2007లో విడుదలయ్యింది. అప్పటి నుంచి అప్‌డేట్ కాబడుతూ ఈ డివైజ్  అందుబాటులో ఉంది. రెటినా డిస్‌ప్లేతో విడుదల కానున్న కొత్త ఐఫోన్ స్ర్కీన్ 4.6 అంగుళాల పరిమాణాన్ని కలిగి ఉండొచ్చని ఓ అంచనా. ఆపిల్‌కు ప్రధాన పోటీదారైన శామ్‌సంగ్ తాజాగా తన గెలక్సీ సిరీస్ నుంచి ఎస్3 మోడల్‌లో 4.6 అంగుళాల OLED డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను వ్ళద్థి చేసిన విషయం తెలిసిందే. ఈ అత్యాధునిక రెటీనా డిస్‌ప్లే ద్వారా వినియోగదారు ఒత్తిడిరహిత అనుభూతికి లోనవుతాడు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot