వన్‌ప్లస్‌కి భారీ షాక్ ఇవ్వనున్న శాంసంగ్
దక్షిణ కొరియా దిగ్గజం దిగ్గజం శాంసంగ్ చైనా మొబైల్ మేకర్ వన్‌ప్లస్‌కి భారీ షాక్ ఇవ్వనుంది.
దక్షిణ కొరియా దిగ్గజం దిగ్గజం శాంసంగ్ చైనా మొబైల్ మేకర్ వన్‌ప్లస్‌కి భారీ షాక్ ఇవ్వనుంది. వన్‌ప్లస్ నుంచి ఈ మధ్య మార్కెట్లోకి దూసకువచ్చి సంచలనం రేపిన OnePlus 6T కన్నా తక్కువ సైజులో ఉండేటా నాచ్ డిస్ ప్లేని భవిష్యత్ ఫోన్లలో తీసుకురానుంది. అయితే శాంసంగ్ కంపెనీ నుంచి ఇప్పటివరకు నాచ్ డిస్ ప్లే మొబైల్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఆ కొరతను తీర్చుకోవడానికి ఈ కంపెనీ త్వరలో రానున్న ఫోన్లలో ఈ రకమైన ఫీచర్ ని అందించనుంది. ఇందుకోసం పేటెంట్ కోసం ధరఖాస్తును కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

waterdrop notch
ఈ పేటెంట్ ప్రకారం శాంసంగ్ నుంచి త్వరలో రానున్న ఫోన్లలో వాటర్ ప్రూప్ తో కూడిన నాచ్ డిస్ ప్లేలు ఉంటాయని ఇవి వన్ ప్లస్ కంపెనీ ఫోన్లు అయిన OnePlus 6T, Oppo R17 Pro ఇతర ఫోన్లకు ధీటుగా ఉంటాయని తెలుస్తోంది.

పేటెంట్ విషయం లీక్
కాగా ఈ పేటెంట్ విషయం Lets Go Digital websiteలో ప్రచురితమైంది. Korean Intellectual Property Office website లో ఈ పేటెంట్ విషయం ఉందని ఇందుకు నిర్దారణగా శాంసంగ్ ఫోన్ కి సంబంధించి అక్కడ ఆరు రకాల స్క్రీన్లతో కూడిన చిత్రాలను పబ్లిష్ చేశారని తెలిపింది.

వన్ ప్లస్ ఫోన్ల కన్నా తక్కువ
ఈ లీకయిన చిత్రాల ప్రకారం శాంసంగ్ నుంచి రానున్న ఫోన్లు OnePlus 6T మోడల్ కన్నా చాలా తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ముందు భాగంలో కేవలం ఫ్రంట్ కెమెరా మాత్రమే ఉండేలా ప్లాన్ చేయనున్నారని సమాచారం.

మధ్యలో ఉండే అవకాశం
కాగా ఈ నాచ్ వాటర్ ప్రూఫ్ మధ్యలో డిజైన్ చేసే అవకాశం ఉందని పక్కభాగంలో కాదని తెలుస్తోంది. మొత్తం స్క్రీన్ అంతా చాలా నాచురల్ గా ఉండేలా తయారుచేయనున్నారు. దీని ద్వారా ఫోన్ పూర్తి స్థాయిలో స్క్రీన్ లుక్ కనిపించనుంది.

‘Infinity’ display panels
శాంసంగ్ ఇప్పటికే మధ్యలో పక్కభాగంలో pin-hole cutoutsతో ఇన్పినిటీ డిస్ ప్లేలతో కూడిన ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురానుంది. Samsung నుంచి త్వరలో రానున్న Galaxy S10లో ఈ రకమైన ఫీచర్ ఉండనుందని ఇప్పటికే వార్తలు లీకయ్యాయి. ఇదిలా ఉంటే చైనా మేకర్ హువాయి తన లేటెస్ట్ ఫ్లాగ్ షిఫ్ ఫోన్ హానర్ నోవా4లో ఈ స్క్రీన్ ని తీసుకువచ్చింది.


Click it and Unblock the Notifications








