కూల్ కూల్ స్మార్ట్‌ఫోన్స్ వస్తున్నాయోచ్..

By Super
|
G’Five
యూజర్స్ యొక్క అభిరుచులను బట్టి రకరకాల స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో విడదలవుతున్నాయి. గత కొన్నిసంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్స్ రంగంలో నోకియా, శ్యామ్‌సంగ్, ఎల్‌జీ లదే హావా. రోజురోజుకీ మార్కెట్లో విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్స్‌ పోటీని తట్టుకునేందుకు గాను మొబైల్ తయారీదారులు కొత్తకొత్త మోడల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిపైవ్ అనే మొబైల్ కంపెనీ మార్కెట్లోకి కొత్త డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో టచ్ స్క్రీన్ మొబైల్స్‌ని విడుదల చేస్తుంది.

జిపైవ్ విడుదల చేయనున్న ఆ రెండు ఫోన్స్ జిపైవ్ జి99, జిపైవ్ జి66ఐ. రెండు మొబైల్స్ కూడా టచ్ అండ్ టైప్ ఇన్ పుట్స్‌ని అందించనున్నాయి. రెండు మొబైల్స్‌కి సంబంధించి ఫీచర్స్ ఏమంత గొప్పగా లేకున్న డ్యూయల్ సిమ్, టచ్ ఫీచర్సే వీటికి కీలకం అంటున్నారు మొబైల్ నిపుణులు. జిఫైవ్ 99 మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే 2.6 ఇంచ్ టిఎఫ్‌టి డిస్ ప్లేని కలిగి ఉంది. దీనితో పాటు మొబైల్‌కున్న డ్యూయల్ డిజిటల్ కెమెరా అదనపు ప్రత్యేకత.

జిఫైవ్ జి99 మొబైల్‌లో జావా ప్లాట్ ఫామ్‌ని ఇమడింప జేయడం జరిగింది. ఈ మొబైల్ 4జిబి వరకు మొమొరీని సపోర్ట్ చేయడంతో పాటు బ్లూటూత్, ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేకం. ఇందులో ఉన్న మ్యూజిక్ ప్లేయర్స్, వీడియో ప్లేయర్స్ అత్యద్బుతం. ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ అన్ని రకాల ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ 800 mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఇక రెండవ మొబైల్ జిపైవ్ జి66ఐ మొబైల్ పుల్ టచ్ స్క్రీన్ హ్యాండ్ సెట్. దీని డిస్ ప్లే 2.8 ఇంచ్ QVGAతో రూపోందించబడింది. ఇందులో ఉన్న ముఖ్యమైన ప్రత్యేకతలు వై-పై కనెక్షన్‌తో పాటు, ఎనలాగ్ టివి. జి99 మొబైల్‌తో పోల్చితే దీనియొక్క బ్యాటరీ పవర్ ఎక్కువ. మొబైల్ వెనుక భాగాన ఉన్న కెమెరా సహాయంతో చక్కని ఇమేజిలు తీయవచ్చు. అదే మొబైల్ ముందు భాగాన ఉన్న కెమెరాతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చుకోవచ్చు.

డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో పాటు డ్యూయల్ స్టాండ్ బై ఆఫ్షన్స్ దీని సొంతం. బ్లూటూత్, ఎఫ్ ఎమ్ రేడియో, 3.5mm ఆడియో జాక్ డీసెంట్ లౌడ్ స్పీకర్స్ దీని ప్రత్యేకతలు. ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ అన్నిరకాల మ్యూజిక్ ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. మొబైల్‌తో పాటు 2జిబి మొమొరీ లభిస్తుండగా మొమొరీని 4జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. త్వరలో విడుదలకు సిద్దంగా ఉన్న ఈ రెండు మొబైల్స్ ఇండియన్ మొబైల్ మార్కెట్లో 'జి99' ధర రూ 2,800గా నిర్ణయించగా, అదే 'జి66ఐ' ధర రూ 4,000గా ఉండవచ్చునని అంచనా...

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X