తక్కవ ధరలో నాలుగు డ్యూయల్ సిమ్ ఫోన్స్....

Posted By: Super

తక్కవ ధరలో నాలుగు డ్యూయల్ సిమ్ ఫోన్స్....

'జి ఫైవ్' అనే మొబైల్ తయారీదారు ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి నాలుగు కొత్త డ్యూయల్ సిమ్ ఫోన్లను విడుదల చేయనుంది. జి ఫైవ్ విడుదల చేయనున్న ఆ నాలుగు హ్యాండ్ సెట్స్ పేర్లు వరుసగా జి ఫైవ్ జి115, జి ఫైవ్ జి116, జి పైవ్ జి233, జి ఫైవ్ జి505. ఈ నాలుగు హ్యాండ్ సెట్స్‌లలో రెండు బేసిక్ మోడల్స్ కాగా, మరో రెండు మాత్రం మల్టీమీడియా ఫీచర్స్ ఉన్న హ్యాండ్ సెట్స్.

పైన పేర్కోన్న వాటిల్లో జి ఫైవ్ జి115, జి ఫైవ్ జి116 రెండు మొబైల్స్ బేసిక్ మోడల్స్ విభాగానికి చెందగా, అదే జి పైవ్ జి233, జి ఫైవ్ జి505 మొబైల్స్ మల్టీమీడియా ఫీచర్స్ ఉన్న మొబైల్స్ విభాగానికి చెందుతాయి. జి ఫైవ్ జి115 విషయానికి వస్తే 4.5cm ఉండి, 1.8 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉందని సమాచారం. మొబైల్ ప్రదాన ఆకర్శణగా కెమెరా, దానితో పాటు డిజిటల్ జూమ్ ప్రత్యేకం. వీటితో పాటు ఎఫ్ ఎమ్ రేడియో, లౌడ్ స్పీకర్, డ్యూయల్ టార్చ్ అదనపు హాంగులు.

ఇక జి ఫైవ్ జి116 మొబైల్ ఫీచర్స్‌ని గమనించినట్లైతే ఏయే ఫీచర్స్ ఐతే జి ఫైవ్ జి115మొబైల్ కున్నాయో అవే ఫీచర్స్ తో పాటుగా, అదనంగా 3.5mm ఆడియో జాక్ ఫెసిలిటీతో పాటు, మీడియా ప్లేయర్ అదనం. జి ఫైవ్ జి115 మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, 4జిబి వరకు మొమొరీని సపోర్ట్ చేస్తుంది. అదే జి ఫైవ్ జి116 మాత్రం 16జిబి వరకు మొమొరీని సపోర్ట్ చేస్తుందని సమాచారం.

మల్టీమీడియా ఫీచర్స్ ఉన్న జి ఫైవ్ జి233 మొబైల్ డిస్ ప్లే స్క్రీన్ సైజు 2.2 ఇంచ్‌లుగా రూపొందించడం జిరిగింది. ఈ మొబైల్ కీప్యాడ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మల్టీ లాంగ్వేజెస్‌ని సపోర్ట్ చేస్తుంది. యూజర్స్ హిందీలో కూడా ఇందులో మేసేజ్‌లను పంపవచ్చు. ఇందులో ఎఫ్ ఎమ్ రేడియో, వీడియో ప్లేయర్, ఆడియో ప్లేయర్‌‍లతో పాటు, వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ కోసం విజిఎ కెమెరాని అమర్చడం జరిగింది. జి ఫైవ్ జి233 మొబైల్ మొమొరీని 8జిబి వరకు స్టోర్ చేసుకుంటుంది.

జి ఫైవ్ జి505 మొబైల్‌తో పాటు 2జిబి మొమొరీ కార్డు ఫ్రీగా లభిస్తుంది. సరిగ్గా జి ఫైవ్ జి233కి మొబైల్‌కి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అన్ని రకాల ఫీచర్స్ ఇందులో ఉండడం విశేషం. మార్కెట్లో జి ఫైవ్ విడుదల చేసిన నాలుగు మొబైల్స్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

జి ఫైవ్ జి115 మొబైల్ ధర: రూ 1,429/-
జి ఫైవ్ జి116 మొబైల్ ధర: రూ 2,459/-
జి ఫైవ్ జి233 మొబైల్ ధర: రూ 2,169/-
జి ఫైవ్ జి505 మొబైల్ ధర: రూ 2,459/-

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot