శామ్‌సంగ్‌కు అందుకే అంత క్రేజ్..?

By Super
|
Galaxy Ace S5830I gets Android 2.3.6 update


అంతర్జాతీయంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తున్న ‘శామ్‌సంగ్’తన పరిధిని మరింత విస్తరించుకుంటుంది. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన గెలక్సీ సిరీస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ఈ సిరీస్ నుంచి కొత్త కొత్త వేరియంట్‌లో

స్మార్ట్‌ఫోన్‍‌లు విడుదలై సూపర్ హిట్ అవుతున్నప్పటికి, పాత వాటికి ఏ మాత్రం క్రేజ్ తగ్గటం లేదు.

గెలక్సీ స్మార్ట్‌ఫోన్‌లకు ఏర్పడిన డిమాండ్ నేపధ్యంలో శామ్‌సంగ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెలక్సీ సిరీస్ నుంచి విడుదలైన ‘ఏస్’(Ace) S5830I మోడల్ మొబైల్‌ను అప్‌డేట్ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ 2.3.6 ఆపరేటింగ్ వ్యవస్థను ఈ డివైజ్‌లో అప్‌గ్రేడ్ చేయునున్నారు.

ఈ కొత్త అప్‌డేట్‌తో ‘గెలక్సీ ఏస్’ స్మార్ట్ ఫోన్ అమ్మకాల విషయంలో సంచలనాలు నమోదు చేయటం ఖాయమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గెలక్సీ ఏస్ పాత కస్లమర్లు సంబంధిత సైట్ల ద్వారా ఈ వోఎస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గెలక్సీ ఏస్

స్మార్ట్‌ఫోన్ ధర మార్కెట్లో రూ.14,000 ఉండగా ఇతర బ్రాండ్‌లైన స్పైస్, సోనీఎరెక్సన్‌లు ఇదే తరహా మొబైల్‌ను తక్కువ ధరకే అందిస్తున్నాయి. ఈ అంశం పై గెలక్సీ వర్గాలు స్పందిస్తూ మన్నిక విషయంలో తమ డివైజ్ పూర్తి భరోసానిస్తుందని స్పష్టం చేశాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X