అగష్టు 30న ఆ ‘మెగా ముహూర్తం’?

సామ్‌సంగ్ గ్యాడ్జెట్ లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ నెలకుంది. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల విడుదలైన స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా మరో ఉత్కంఠకు సామ్‌సంగ్ తెర లేపింది. గెలాక్సీ నోట్ ఫాబ్లెట్‌కు తరువాతి వర్షన్‌గా గెలాక్సీ నోట్ 2 ఫాబ్లెట్ ను సామ్‌సంగ్ డిజైన్ చేసింది. గత కొన్ని రోజులుగా ఈ డివైజ్‌కు సంబంధించిన పలు ఫీచర్లు అభిమానులను ఊరిస్తున్నాయి. అగష్టు 30వ తేదీన ఈ మెగా గ్యాడ్జెట్‌ను ఆవిష్కరించనున్నారు. కొరియన్ డిజిటల్ డైలీ వెల్లడించిన సమాచారం మేరకు.. సామ్‌సంగ్, అగష్టు 30న ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక పై గెలాక్సీ నోట్ 2ను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తుంది. గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు (అంచనా)... 5.5. అంగుళాల ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1680 x 1050పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఆర్మ్ కార్టెక్స్ ఏ15 ఆధారిత Exynos 5250ప్రాసెసర్, 5జీబి ర్యామ్, 13 మెగాపిక్సల్ కెమెరా.
రె‘ఢీ’గా గెలాక్సీ ట్యాబ్ 2:
సామ్‌సంగ్ ‘గెలాక్సీ టాబ్ 2’ పేరుతో పెద్ద స్ర్కీన్ టాబ్లెట్ కంప్యూటర్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆడ్వాన్సుడ్ ఫీచర్లతో లోడై ఉన్న ఈ గ్యాడ్జెట్ కమ్యూనికేషన్ ఇంకా కంప్యూటింగ్ అవసరాలను సమృద్థిగా తీరుస్తుంది. టాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా…
0 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, మెమరీ వేరియంట్స్ 16జీబి, 32జీబి, డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 3మెగాపిక్సల్ రేర్ కెమెరా, వీజఏ ఫ్రంట్ కెమెరా, హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, వై-ఫై, బ్లూటూత్ వీ3.0, యూఎస్బీ 2.0, డిజిటల్ కంపాస్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, మ్యూజిక్ ప్లేయర్ (సౌండ్ ఎలైవ్), పొలారిస్ డాక్యుమెంట్ ఎడిటర్, సామ్‌సంగ్ అప్లికేషన్స్, సామ్‌సంగ్ టచ్‌విజ్, లైవ్ ప్యానల్ యాక్సిస్, స్టాండర్డ్ లియోన్ 7000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, హెచ్‌ఎస్‌పీఏ+ 21ఎంబీపీఎస్ 850/900/1900/2100, యాక్సిలరోమీటర్, డిజిటల్ కంపాస్, లైట్ సెన్సార్, ధర రూ.33,000.


Click it and Unblock the Notifications








