జోరుమీదున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3... రెండు నెలల్లో కోటి యూనిట్ల అమ్మకాలు!!

Posted By:

జోరుమీదున్న సామ్‌సంగ్... రెండు నెలల్లో కోటి యూనిట్ల అమ్మకాలు!!

సామ్‌సంగ్ నుంచి ఇటీవల విడుదలైన గెలాక్సీ నోట్ 3 అమ్మకాల పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ పెద్దతెర ఫాబ్లెట్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా రెండు నెలల వ్యవధిలో 10 మిలియన్ యూనిట్ల విక్రయాలు జరిగినట్లు సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం వెల్లడించింది. గెలాక్సీ నోట్ 2 ఈ అమ్మకాల మార్క్‌ను అధిగమించేందుకు నాలుగు నెలల సమయం తీసుకుందట. మరోవైపు సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్‌‌ఫోన్ గెలాక్సీ ఎస్4 కేవలం 30 రోజుల వ్యవధిలో 10 మిలియన్ యూనిట్లు అమ్మకాలకు చేరుకోగలిగింది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 కీలక స్పెసిఫికేషన్‌లు: ఫోన్ పరిమాణం 151.2 x 79.2 x 8.3మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు, 8 కోర్ ఎక్సినోస్ 5 ఓక్టా ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ రిసల్యూలసన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, హై‌ సీఆర్ఐ ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కలర్ వేరియంట్స్: బ్లాక్, పింక్, వైట్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot