శాంసంగ్‌కు మరో భారీ షాక్, ఆ ఫోన్లన్నీ వెనక్కి..

Written By:

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కు తన గెలాక్సీ నోట్ 4తో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గెలాక్సీ నోట్ 7 ఫోన్ బ్యాటరీ పేళుళ్లతో సతమతమైన కంపెనీకి గెలాక్సీ నోట్ 4 బ్యాటరీలు నిద్రలేని రాత్రులను మిగిలిస్తున్నాయి. ఈ మొబైల్‌లోని బ్యాటరీలో తలెత్తిన లోపాల కారణంగా ఫోన్ భారీ హీట్ అవుతోందని వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గెలాక్సీ నోట్ 7 పేలిపోవడానికి కారణం ఇదే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ నోట్‌ 4 మోడల్‌లో

నోట్ 7 మంటలు చల్లారిన తర్వాత మళ్లీ గెలాక్సీ నోట్‌ 4 మోడల్‌లో బ్యాటరీ లోపం తలెత్తింది. దీంతో ఫోన్‌ విపరీతంగా వేడెక్కుతోందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం.

బ్యాటరీలో లోపాల కారణంగా

అమెరికాలో గెలాక్సీ నోట్‌ 4లోని కొన్ని మొబైల్స్‌ విపరీతంగా వేడెక్కుతుండటంతో వాటిని వెనక్కి తీసుకున్నారు. బ్యాటరీలో లోపాల కారణంగా అది పేలే అవకాశం ఉందన్న కారణంతో వీటిని వెనక్కు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ లోపానికి

అయితే సారి ఈ లోపానికి శాంసంగ్‌ మాత్రం కారణం కాదు. అమెరికాలోని ప్రముఖ కేరియర్‌ ఏటీ అండ్‌ టీ సంస్థ ఇన్సూరెన్స్‌ ప్రోగ్రాంలో భాగంగా ఫెడెక్స్‌ సంస్థతో కలిసి ఈ మోడల్‌కు సంబంధించిన రీఫర్బిష్డ్‌ మోడల్‌ను విక్రయించింది.

10వేల ఫోన్లలో

ఈ సంస్థ అలా విక్రయించిన వాటిలో దాదాపు 10వేల ఫోన్లలో బ్యాటరీ సమస్య తలెత్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఖంగుతిన్న ఫెడెక్స్‌ సంస్థ వాటిని వెనక్కు తీసుకుంది.

స్పందించిన శాంసంగ్‌

ఈ వార్తలపై స్పందించిన శాంసంగ్‌ ‘ఫెడెక్స్‌ సప్లై చైన్‌ సంస్థ ప్రస్తుతం సమస్య తలెత్తిన బ్యాటరీలను వెనక్కు తీసుకుంటోందని, రీఫర్బిష్డ్‌ పోగ్రాం ఫెడెక్స్‌ సప్లై చైన్‌ నిర్వహించగా దీన్ని శాంసంగ్‌ పర్యవేక్షించిందని తెలిపింది.

ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా

మరోవైపు ఫెడెక్స్‌ సంస్థ సైతం తాము వినియోగదారులతో మాట్లాడామని సమస్య తలెత్తిన లిథియం బ్యాటరీలను ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా మార్చి వారికి ఇస్తామని ప్రకటించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Galaxy Note 4 batteries are being recalled for overheating risk Read more At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot