రూమర్ రౌండప్: ‘విడుదలకు ముందే స్టోరి లీక్’!

Posted By: Prashanth

రూమర్ రౌండప్: ‘విడుదలకు ముందే స్టోరి లీక్’!

 

ఆపిల్ ఐప్యాడ్ మినీకి పోటీగా సామ్‌సంగ్ మరికొద్ది గంటల్లో ఆవిష్కరించబోతున్న ‘గెలాక్సీ ఎస్3 మినీ’ యూవత్ టెక్ ప్రపంచాన్ని ఉత్కంఠతకు లోను చేస్తోంది. ఈ నేపధ్యంలో ప్రముఖ జర్మన్ బ్లాగ్ ‘మొబైల్ గీక్స్’, గెలాక్సీ ఎస్3 మినీ ఫోటోగ్రాఫ్‌తో పాటు డివైజ్‌కు సంబంధించిన పలు కీలక స్పెసిఫికేషన్‌లను బహిర్గతం చేసింది. ఈ బ్లాగ్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు గెలాక్సీ ఎస్3 మినీ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.

- ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ నెంబర్ ‘GT-I8190’,

- 4 అంగుళాల సూపర్ ఆమోల్డ్ మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 × 480),

- డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

- 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్),

- వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

- 1జీబి ర్యామ్,

- 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

- మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

- ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

- కనెక్టువిటీ ఫీచర్లు (మైక్రోయూఎస్బీ పోర్ట్, బ్లూటూత్ 4.0, వై-ఫై a/b/g/n,

- 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

- ధర రూ.27,000.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot