బడ్జెట్ ఎఫెక్ట్: ధరలు పెంచేసిన సామ్‌సంగ్!

Posted By:

2013-14కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం రూ.2000 పైన ధరను కలిగి ఉండే విదేశీ బ్రాండ్‌ల మొబైల్ ఫోన్‌ల పై దిగుమతి సుంకాంన్ని 1శాతం నుంచి 6 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తాజా నిబంధన ఏప్రిల్ నుంచి అమలులోకి రానుంది. ఈ నేపధ్యంలో సామస్ంగ్ ఇప్పటి నుంచే ధరల వడ్దనకు శ్రీకారం చుట్టంది.

ఈ పోస్ట్ కూడా చదవండి:

హాట్ టాపిక్.. ఇందిరా గాంధీ అలా?

బీజీఆర్ ఇండియా వెలువరించిన ఓ కథనం ప్రకారం సామ్‌సంగ్ పలు గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ మోడళ్ల పై ధరలను పెంచేసింది. గెలాక్సీ ఎస్3, గెలాక్సీ ఏస్, గెలాక్సీ ఏస్ డ్యుయోస్, గెలాక్సీ ఎస్ డ్యుయోస్ వంటి స్మార్ట్‌ఫోన్‌లకు తాజా ధర పెంపు వర్తించింది. ఈ ధర పెంపు స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితం కాలేదు. సామ్‌సంగ్ ట్యాబ్లెట్‌లకు సైతం వర్తించింది. ధరలు పెరిగిన గాడ్జెట్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించి ఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బడ్జెట్ ఎఫెక్ట్: ధరలు పెంచేసిన సామ్‌సంగ్!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (Samsung Galaxy S3):

4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
క్వాడ్‌కోర్ 1.4గిగాహెట్జ్ ఎక్సినోస్ 4 క్వాడ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

పాత ధర రూ.28,000.
కొత్త ధర రూ.29,700.

బడ్జెట్ ఎఫెక్ట్: ధరలు పెంచేసిన సామ్‌సంగ్!

సామ్‌‍సంగ్ గెలాక్సీ నోట్ 2 (Samsung Galaxy Note 2):

పాత ధర రూ.33,500,
కొత్త ధర రూ.35,500

స్పెసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై, బ్లూటూత్, ఎస్‌పెన్ సపోర్ట్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బడ్జెట్ ఎఫెక్ట్: ధరలు పెంచేసిన సామ్‌సంగ్!

సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ డ్యుయోస్ (Samsung Galaxy S Duos):

పాత ధర రూ.12,400
కొత్త ధర రూ.13,100

స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, 768ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1500ఎమ్ఏహెచ లియోన్ బ్యాటరీ.

బడ్జెట్ ఎఫెక్ట్: ధరలు పెంచేసిన సామ్‌సంగ్!

సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ డ్యుయోస్ (Samsung Galaxy Ace Duos):

పాత ధర రూ.10,500,
కొత్త ధర రూ.11,130.

స్పెసిఫికేషన్‌లు:

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
832మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
512ఎంబి ర్యామ్, 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బడ్జెట్ ఎఫెక్ట్: ధరలు పెంచేసిన సామ్‌సంగ్!

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 310 (Samsung Galaxy Tab 2 310):

పాత ధర రూ.15,500,
కొత్త ధర రూ.16,400,

స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల పీఎల్ఎస్ టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, ఏ-జీపీఎస్,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot