మెగా ఫ్యామిలీలో... ఆ ఇద్దరి మధ్య?

Posted By: Prashanth

మెగా ఫ్యామిలీలో... ఆ ఇద్దరి మధ్య?

 

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మోగా ఫ్యామిలీగా గుర్తింపుతెచ్చుకున్న సామ్‌సంగ్ సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. ఒకవైపు ఆండ్రాయిడ్ మరోవైపు విండోస్ ఆధారిత ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తూ సామ్‌సంగ్ తన అమ్మకాలను మరింత పెంచుకుంటోంది. ఈ 4వ త్రైమాసికానికి సామ్‌సంగ్ అమ్మకాలు 61.5మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశముందని మార్కెట్ రిసెర్చర్లు అంచనా వేస్తున్నారు. సామ్‌సంగ్ అమ్మకాల పెరుగుదలకు గెలాక్సీ ఎస్3 ఓ కారణమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గెలాక్సీ ఎస్3, 5 నెలల వ్యవధిలో 30 మిలియన్ యూనిట్లు అమ్ముకాలను అధిరోహించి సామ్‌సంగ్ చరిత్రలో రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. తాజాగా గెలాక్సీ ఎస్3 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1 అప్‌డేట్‌ను అందుకుంది. ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ ఎస్3 ధరలను పరిశీలిస్తే 16జీబి వేరియంట్ ధర రూ. 34,900, 32జీబి వేరియంట్ ధర రూ. 43,180. మరోవైపు విండోస్ 8 ఆధారితంగా స్పందించే ‘ఏటీవీఐ ఎస్’సామ్‌సంగ్ ఇటీవల ఆవిష్కరించింది. డిసెంబర్‌లో ఈ డివైజ్ లభ్యమవుతుంది. ఈ నేపధ్యంలో రెండు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా........

బరువు ఇంకా చుట్టుకొలత.........

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: చుట్టుకొలత 136.6 x 70.6 x 8.6మిల్లీ మీటర్లు, బరువు 133గ్రాములు,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: చుట్టుకొలత 137.2 x 70.5 x 8.7మిల్లీ మీటర్లు, బరువు 135 గ్రాములు,

డిస్‌ప్లే.....

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్1280 x 720పిక్సల్స్,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్1280 x 720పిక్సల్స్,

ప్రాసెసర్......

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: ఎక్సినోస్ 4412 క్వాడ్‌చిప్ సెట్,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం.......

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: ప్రాజెక్టు బట్టర్చ, ఆన్-స్ర్కీన్ నేవిగేషన్ బటన్స్, కాంట్రిక్టబుల్ ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్, రీసైజబుల్ అప్లికేషన్ విడ్జెట్స్, హైరిసల్యూషన్ కాంటాక్ట్ ఫోటోస్, ఆండ్రాయిడ్ బీమ్ అప్లికేషన్,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: డైనమిక్ లైవ్‌టైల్ సమాచారం, సోషల్ నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్, పీపుల్ హబ్, స్కై డ్రైవ్, ఆఫీస్ 365 డాక్యుమెంట్స్ సింక్రనైజేషన్, ఫేస్‌బుక్ -ఈవెంట్స్ ఇంటిగ్రేటెడ్ క్యాలెండర్, విజువల్ వాయిస్ మెయిల్ ),

కెమెరా...

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్......

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: స్టోరేజ్ వేరియంట్స్ 16జీబి /32జీబి /64జీబి , 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: ఇంటర్నల్ మెమెరీ ఆప్షన్స్ 16జీబి/ 32జీబి, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ....

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ....

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 11.5 గంటలు, స్టాండ్‌బై టైమ్ 790గంటలు),

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: 2300ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధరలు ....

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: 16జీబి వేరియంట్ ధర రూ. 34,900, 32జీబి వేరియంట్ ధర రూ. 43,180,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: ధర అంచనా రూ.30,000.

Read In English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot