నేడే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఆవిష్కరణ: ప్రత్యేకతలు?

Posted By:

సామ్‌సంగ్ కొత్త జనరేషన్ స్మార్ట్‌‍ఫోన్ ‘గెలాక్సీ ఎస్4' ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. గెలాక్సీ ఎస్3కి సక్సెసర్ వర్షన్‌గా ఇప్పటికే భారీ అంచనాలు నమోదు చేసిన ఈ అధికముగింపు స్మార్ట్‌ఫోన్‌ను గురువారం న్యూయార్క్ నగరంలో ఏర్పాటు చేసిన ‘గ్లోబల్ అన్‌ప్యాకెడ్ ఈవెంట్'లో ఆవిష్కరించనున్నారు. ఈ డివైజ్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఇప్పటి వరకు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేసిన పలు రూమర్‌లకు మరికొద్ది సేపటిలో తెరపడనుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గెలాక్సీ ఎస్4కు సంబంధించి 5 ప్రత్యేక విశిష్టతలను మీకు పరిచయం చేస్తున్నాం......

మరిన్ని గెలాక్సీ ఎస్4 ఫోటోల కోసం క్లిక్ చేయండి:

5 అంగుళాల పూర్తిస్థాయి హైడెఫినిషన్ డిస్‌ప్లే:

గెలాక్సీ ఎస్4 డిస్‌ప్లేకు సంబంధించి మొదటి నుంచి ఓ బలమైన రూమర్ మార్కెట్లో వినిపిస్తోంది. ఈ సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 4.99 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం 1920 x 1080పిక్సల్స్.

నేడే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఆవిష్కరణ: ప్రత్యేకతలు?

4జీ సపోర్ట్:

యూకె ప్రాంతానికి చెందిన ప్రముఖ ఎల్టీఈ ఆపరేటర్ ఈఈ (EE), సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4, 4జీ సపోర్ట్‌ను కలిగి ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది.

13 మెగా పిక్సల్ 3డీ కెమెరా ఇంకా సామ్‌సంగ్ ఆర్బ్:

గెలాక్సీ ఎస్4, 3డీ కెమెరాను కలిగి ఉండొచ్చన్న వాదన మార్కెట్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గూగుల్ ఫోటో స్పియర్ తరహాలో సామ్‌సంగ్ ఆర్బ్‌ను గెలాక్సీ ఎస్4లో ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఐ-ట్రాకింగ్ టెక్నాలజీ:

గెలాక్సీ ఎస్4 సరికొత్త ఐ-ట్రాకింగ్ టెక్నాలజీని కలిగి ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ రూమర్లు నిజమైతే గెలాక్సీ ఎస్4ను కంటి చూపుతో ఆపరేట్ చేసుకోవచ్చు.

ఇతర ప్రత్యేక ఫీచర్లు (అంచనా మాత్రమే):

2జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot