గెలాక్సీ ఎస్4 రూమర్ అప్‌డేట్!

Posted By: Prashanth

గెలాక్సీ ఎస్4 రూమర్ అప్‌డేట్!

 

సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి విడుదలై ఈ ఏడాదికి గాను అత్యుత్తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపుతెచ్చుకున్న ‘గెలాక్సీ ఎస్3’సక్సెసర్ వర్షన్‌గా గెలాక్సీ ఎస్4 రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. సామ్‌సంగ్ ఈ లేటెస్ట్ వర్షన్ గెలాక్సీ డివైజ్‌ను 2013 ఫిబ్రవరిలో ఆవిష్కరించేందకు సన్నాహాలు చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో జనవరిలో నిర్వహించే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్‌లో సామ్‌సంగ్ తాజాగా వృద్ధి చేసిన 5 అంగుళాల హైడెఫినిషన్ ఆమోల్డ్ ప్యానల్‌ను ప్రదర్శించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు మారో గాసిప్ హల్‌చల్ చేస్తోంది. ఈ తాజా అప్‌డేట్‌తో గెలాక్సీ ఎస్4 పూర్తిస్థాయి హైడెఫినిషన్ ఆమోల్డ్ ప్యానల్‌ను కలిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ఇక డివైజ్ ఫీచర్లకు సంబంధించి.. అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డివైజ్‌లో వినియోగించిన కార్టెక్స్-ఏ15డిజైన్‌తో కూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను ‘అడోనిస్’ (Adonis) కోడ్ నేమ్‌తో పిలుస్తున్నట్లు డిజిటల్ డైలీ పేర్కొంది. గెలాక్సీ ఎస్4ను వచ్చే ఏడాది ఆరంభంలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై ఆవిష్కరించేందుకు సామ్‌సంగ్ సిద్ధంగా ఉన్నట్లు పేరు చెప్పటానికి నిరాకరించిన సామ్‌సంగ్ ప్రతినిధి ఒకరు తమతో తెలపినట్లు కొరియన్ న్యూస్ వర్గాలు వెల్లడించాయి.

పలు నివేదికలు ఆధారంగా సేకరించిన గెలాక్సీ ఎస్4 ఫీచర్లు (ఊహాజనితంగా):

5 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే,

441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,

రిసల్యూషన్ 1920× 1080పిక్సల్స్,

మెమరీ వేరియంట్స్: 16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి,

3జీబి ర్యామ్,

3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

1.9మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (స్కైప్ రెడీ ఫీచర్),

ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot