Home
Mobile

ప్రీఆర్డర్ పై ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4’, ధర రూ 59,990!

నాలుగు రోజుల క్రితం సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన ఫోన్ ‘గెలాక్సీ ఎస్4' ముందస్తు బుకింగ్‌లకు సంబంధించి ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ రెడిఫ్ షాపింగ్ (Rediff Shopping)పలు కీలక వివరాలను తన లిస్టింగ్స్‌లో పొందుపరిచంది. ఈ ఆన్‌లైన్ రిటైలర్ గెలాక్సీ ఎస్4ను రూ.59,990కి ఆఫర్ చేస్తోంది. గాడ్జెట్ కొనుగోలుకు సంబంధించి మూడు నెలల ఈఎమ్ఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. పూర్తి వివరాల కోసం లింక్ అడ్రస్:

గెలాక్సీ ఎస్3కి సక్సెసర్ వర్షన్‌గా రూపుదిద్దుకున్న గెలక్సీ ఎస్4 ఆవిష్కరణకు సంబంధించి పూర్వాపరాలను పరిశీలించినట్లయితే... గెలాక్సీ ఎస్‌4ను గురవారం (మార్చి 14) న్యూయార్క్‌లోని మాన్హాటన్ ఐకానిక్ రేడియో సిటీ మ్యూజిక్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక అన్ ప్యాకెడ్ 2013 కార్యక్రమంలో ఆవిష్కరించటం జరిగింది. డివైజ్ ఏప్రిల్ నుంచి మార్కెట్లో లభ్యంకానుంది.

Galaxy S4 up for Online Pre Order at Rs 59990: Will You Buy the Samsung Flagship?

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, రిసల్యూషన్1080x 1920పిక్సల్స్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.9గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ / 1.6గిగాహెట్జ్ వోక్టా కోర్ ప్రాసెసర్ (ప్రాంతాన్ని బట్టి), 2జీబి ర్యామ్, స్టోరేజ్ వర్షన్స్ (16/32/64 జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్/ఏసీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ), బ్లూటూత్ 4.0, ఐఆర్ ఎల్ఈడి, ఎంహెచ్ఎల్ 2.0, 2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ, చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు 130 గ్రాములు.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X