గెలాక్సీ ఎస్7 వచ్చేసింది

Written By:

సామ్‌సంగ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు ప్రపంచానికి పరిచయమయ్యింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016ను పురస్కరించుకుని బార్సిలోనాలో నిర్వహించిన గెలాక్సీ అన్‌ప్యాకుడ్ ఈవెంట్‌లో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్‌లను ఆవిష్కరించింది. డ్యుయల్ పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోన్న ఈ ఫోన్‌ల ద్వారా తక్కువ వెళుతరు కండీషన్‌లలోనూ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు.

గెలాక్సీ ఎస్7 వచ్చేసింది

ఈ రెండు ఫోన్‌లు సిమిలర్ హార్డ్‌వేర్ స్పెక్స్‌తో సామ్‌సంగ్ విడుదల చేసింది. డిస్‌ప్లే ఇంకా బ్యాటరీ విషయంలో మాత్రమే స్వల్ప మార్పులు ఉంటాయి. ఎస్ 7 వేరియంట్ 5.1 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుండగా, ఎస్7 ఎడ్జ్ 5.5 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. బ్యాటరీ విషయంలోనూ అంతే గెలాక్సీ ఎస్7 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుండగా, ఎస్ 7 ఎడ్జ్ 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

Read More : మీ ఫోటో పెన్సిల్ స్కెచ్‌గా మారాలా..?

క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేలను ఈ రెండు ఫోన్‌లలో ఏర్పాటు చేసారు, రిసల్యూషన్ సామర్థ్యం (2560 x 1440పిక్సల్స్). ఆండ్రాయిడ్ 6.0 మార్స్ మల్లో ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్న ఈ ఫోన్‌లు 32జీబి అలానే 64జీబి ఇంటర్నల్ మెమరీ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్‌లకు సంబంధించిన మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని సామ్‌సంగ్ కల్పిస్తోంది. 4జీబి ర్యామ్, డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ర్యామ్ వంటి ప్రత్యేకతలు ఆకట్టుకుంటాయి. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు క్రింది స్లైడర్‌‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560×1440పిక్సల్స్), 534 పీపీఐ.

ప్రాసెసర్,

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ రెండు ప్రాసెసర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. మొదటి వేరియంట్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ కాగా రెండవ వేరియంట్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 8 ఆక్టా 8890 ప్రాసెసర్,

 

స్టోరేజ్ ఇంకా ర్యామ్

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్‌లో హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌లను పొందుపరిచారు. 4జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరినీ 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

కెమెరా

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

కెమెరా

డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్ 1.7 అపెర్చర్, స్మార్ట్ ఓఐఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

ఐపీ68 రేటింగ్‌

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఐపీ68 రేటింగ్‌తో వస్తోంది. వాటర్ ఇంకా డస్ట్ ప్రమాదాలను గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ సమర్థవంతంగా తట్టుకోగలదు.

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. యాప్ పర్మిషన్, గూగుల్ నౌ ఆన్ టాప్, డోజ్ మోడ్, ర్యామ్ మేనేజర్, ఆటో బ్యాకప్, బ్యాటరీ లైఫ్, ఆటో హ్యాండ్లింగ్ యాప్స్, ఆండ్రాయిడ్ పే వంటి ప్రత్యేక ఫీచర్లను ఎస్7 ఎడ్జ్ అందిస్తుంది.

"Always-On Display"

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్ కు "Always-On Display" ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫీచర్ ఫోన్ స్ర్కీన్ పై ఎఫ్పుడు ఆన్ అయ్యే ఉంటుంది. క్లాక్, నోటిఫికేషన్స్, క్యాలెండర్‌లను ఈ ఫీచర్ డిస్‌ప్లే సూచిస్తుంది. తద్వారా చీటికి మాటికి పోన్‌ను ఓపెన్ చేయకుండా బ్యాటరీ ఆదా చేయవచ్చు.

 

కనెక్టువిటీ ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై 802.11, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, వంటి కనెక్టువిటీ ఆప్షన్‌లను సపోర్ట్ చేస్తుంది.

 

బ్యాటరీ

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్

 

కలర్ వేరియంట్స్

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ బ్లాక్ ఆనియక్స్, గోల్డ్ ప్లాటినమ్, సిల్వర్ టైటానియమ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Galaxy S7 Edge in Pictures: 10 All New Features Which You Won't Find in Galaxy S6 Edge. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting