ఆ రేంజ్‌లో హిట్టవటానికి కారణలు ఇవే!

Posted By: Prashanth

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

display

display

quad-core-exynos-processor

quad-core-exynos-processor

s-voice

s-voice

camera

camera

colors

colors
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారీ అంచనాల మధ్య మే3న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కిరించారు. బ్రాండ్ విలువకు అత్యాధునిక స్పెసిఫికేషన్‌లు తోడవటంతో గెలాక్సీ ఎస్3 కొద్ది రోజుల్లోనే 9 మిలియన్ యూనిట్ల ప్రీఆర్డర్‌ను దక్కించుకోగలిగంది. మే 29న యూరోప్‌తో సహా 29 దేశాల్లో గెలాక్సీ ఎస్3ని విడుదల చేశారు. మే31న భారత్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా 145 దేశాల్లో ఈ స్మార్ట్ డివైజ్‌ను విక్రియించనున్నారు. గెలాక్సీ ఎస్3 ఫీచర్లకు సంబంధించి పలు కీలక చిత్రాలను పై గ్యాలరీలో చూడొచ్చు.

గెలాక్సీ ఎస్-3లోని ప్రత్యేక ఫీచర్లు:

పెద్దదైన డిస్ ప్లే: గెలాక్సీ ఎస్3, 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 720పిక్సల్స్. ఈ డిస్‌ప్లే ద్వారా యూజర్ ఉత్తమమైన విజువల్ అదేవిధంగా గ్రాఫిక్ అనుభూతులను ఆస్వాదించగలుగుతాడు.

In English

ఉత్తమమైన కెమెరా: గెలాక్సీ ఎస్3లో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ కెమెరా అత్యుత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. ఈ కెమెరా వేగం సెకనుకు 8 షాట్స్, మీ మధరుస్మృతులను హై క్వాలిటీతో బంధించి కలకాలం పదిలపరుస్తుంది.

స్మార్ట్ స్టే: యజమాని ముఖాన్ని, మాటలను గుర్తించి తదనుగుణంగా పనిచేయడమే ‘స్మార్ట్ స్టే’ ఫీచర్ విశిష్టత . యూజర్ ఫోన్‌ను చూస్తున్నంత సేపు స్క్రీన్ ప్రకాశవంతంగా ఉంటుంది.

ఎస్ వాయిస్: మీకు నచ్చిన పాట పేరు చెబితే చాలు దాన్ని ప్లే చేస్తుంది. వాల్యూమ్‌ను పెంచమని, తగ్గించమని చెప్పొచ్చు. కెమేరా ఆన్ చేసి ఫొటోలు తీయమనవచ్చు. మెయిల్స్, మెసేజ్‌లు పంపమనొచ్చు.

ఆల్‌షేర్ ప్లే : ఆప్షన్‌తో ఎటువంటి ఫైల్‌ను అయినా మరో గెలాక్సీ ఎస్-3కి, ట్యాబ్లెట్‌కు, పీసీకి, టీవీకీ పంపవచ్చు. వాటి మధ్య దూరంతో పనిలేదు.

డెరైక్ట్ కాల్ : మెసేజ్ టైప్ చేస్తున్న సందర్భంలో అదే నంబరు గల వ్యక్తికి ఫోన్ చెయ్యాలనిపిస్తే, జస్ట్ ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకొంటే చాలు సంబంధిత నంబర్‌కు ఫోన్ డయల్ అవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot