పాంచ్ పటాకా...!!!

Posted By: Staff

దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో అనేక బ్రాండ్లు వీటిని విడుదల చేస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో పలు తయారీ కంపెనీలు మేలు రకం స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను సమంజసమైన ధరలకే విక్రయిస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లను కలిగి రూ.10,000 దిగువ ధరకు లభ్యమయ్యే టాప్-5 స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి వివరాలు....

 

సామ్‌సంగ్ గెలాక్సీ వై ప్రో డ్యుయోస్:

పాంచ్ పటాకా...!!!

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ 2.6 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ (240 x 320పిక్సల్స్). ఏర్పాటు చేసిన క్వర్టీ కీప్యాడ్ సందేశాలు పంపుకునేందుకు మరింత అనువుగా ఉంటుంది. డ్యూయల్ సిమ్ నెట్‌వర్క్‌లను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్‌కు సహకరిస్తుంది. 832మెగాహెడ్జ్ సామర్ధ్యం గల ప్రాసెసర్‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. అమర్చిన 3 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమమైన ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. ధర రూ.9,500.

 

స్పైస్ ఎమ్ఐ 425:

పాంచ్ పటాకా...!!!

ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల ఆవిష్కరించారు. 4.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్). ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టంను తర్వలోనే ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు వృద్ధి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొబైల్ ప్రాసెసింగ్ వేగాన్ని మరింత రెట్టిపు చేసే 1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేశారు. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా నాణ్యమైన ఫోటోగ్రఫీని అందిస్తుంది. వై-ఫై ఇంకా 3జీ కనెక్టువిటీ వ్యవస్థలు నెట్ బ్రౌజింగ్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. బ్లూటూత్ వర్షన్ 2.1 డేటాను వేగవంతంగా షేర్ చేస్తుంది. ముందుగా ఇన్స్‌టాల్ చేసిన ఫేస్‌బుక్, నింబజ్ వంటి సామాజిక నెట్‌వర్కింగ్ అంశాలు యూజర్‌ను సమాజానికి కనెక్ట్ చేసి ఉంచుతాయి. ధర రూ.9400.

 

కార్బన్ ఏ9:

పాంచ్ పటాకా...!!!

ఈ డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఫోన్ 3జీ సౌలభ్యతను కలిగి ఉంటుంది. 3.8 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్టే ఉత్తమ విజువల్ అనుభూతులను చేరువ చేస్తుంది. 5 మెగా పిక్సల్ కెమెరా హై డెఫినిషన్ వీడియోలను రికార్డ్ చేస్తుంది. ఇంటర్నల్ మెమెరీ 1జీబి, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా

మెమెరీని 32జీబికి పెంచుకోవచ్చు. ధర రూ.9,200.

 

హెచ్‌టీసీ ఎక్స్‌ప్లోరర్:

పాంచ్ పటాకా...!!!

హెచ్‌టీసీ నుంచి డిజైన్ కాబడిన ఈ ఫోన్ 3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్‌ ను కలిగి ఉంటుంది.

ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం.

హెచ్‌టీసీ సెన్స్ 3.5 యూజర్ ఇంటర్‌ఫేస్.

600మెగాహెడ్జ్ ప్రాసెసర్,

3జీ కనెక్టువిటీ,

3.2మెగా పిక్సల్ కెమెరా,

ధర రూ.8,900.

 

ఎల్‌జీ ఆప్టిమస్ నెట్:

ఈ స్మార్ట్‌ఫోన్ ఆప్టిమస్ వన్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా విడుదలయ్యింది.

3.2 అంగుళాల టచ్ స్ర్కీన్.

ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎమ్ఎస్ఎమ్ 7227టీ ప్రాసెసింగ్ చిప్,

అడ్రినో గ్రాపిక్ యూనిట్,

800 మెగాహెడ్జ్ ప్రాసెసర్,

ర్యామ్ సామర్ధ్యం 512 ఎంబీ,

3.2 మెగాపిక్సల్ కెమెరా,

1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.8,700.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot