జీనియస్ పవర్ బ్యాంక్... మీ స్మార్ట్‌ఫోన్‌లకు తక్షణ శక్తి

Posted By:

స్మార్ట్‌ఫోన్‌‍లు అలానే ట్యాబ్లెట్ పీసీలను వినియోగిస్తోన్న యూజర్లను ప్రధానంగా వేధిస్తున్న సమస్య బ్యాటరీ బ్యాకప్. రకరకాల అప్లికేషన్‌లను ఈ గాడ్జెట్‌లలో తరచూ ఉపయోగించటం ద్వారా బ్యాటరీ చార్జింగ్ అనూహ్యమైన రీతిలో తగ్గిపోతోంది. మరీ ముఖ్యంగా తరచూ ప్రయాణాలు చేసే వారికి ఈ సమస్య తలబొప్పి కట్టిస్తోంది.

జీనియస్ పవర్ బ్యాంక్... మీ స్మార్ట్‌ఫోన్‌లకు తక్షణ శక్తి

బ్యాటరీ చార్జింగ్ సమస్యలకు పరిష్కారాన్ని వెతికే క్రమంలో, కంప్యూటర్ ఉపకరణాలు అలానే స్మార్ట్‌ఫోన్ సంబంధిత ఉత్పత్తులను తయారు చేసే ప్రముఖ కంపెనీ జీనియస్ (Genius) ‘ఇకో - యూ306'(ECO-u306) పేరుతో అధిక సామర్థ్యం కలిగి పవర్ బ్యాంక్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది.

జీనియస్ పవర్ బ్యాంక్... మీ స్మార్ట్‌ఫోన్‌లకు తక్షణ శక్తి

ఈ అతి పలుచటి నాజూకు శ్రేణి పవర్ బ్యాంక్ 3000ఎమ్ఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని కలిగి ఉంటుంది. బ్లాక్, వైట్, బ్లూ ఇంకా పింక్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతున్న ఈ పవర్ బ్యాంక్ ధర రూ.2,000.

జీనియస్ పవర్ బ్యాంక్... మీ స్మార్ట్‌ఫోన్‌లకు తక్షణ శక్తి

ప్రత్యేకమైన మైక్రోయూఎస్బీ కేబుల్ వ్యవస్థను ఈ పవర్ బ్యాంక్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ పవర్ బ్యాంక్‌ను ముందుగా పూర్తిస్థాయిలో చార్జ్ చేసుకున్నట్లయితే స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీలకు బ్యాటరీ శక్తి అవసరమైనపుడు ఈ పవర్ బ్యాంక్‌ను యూఎస్బీ కేబుల్ సాయంతో అనుసంధానించుకుని సదరు గాడ్జెట్‌లను నిమిషాల వ్యవధిలో చార్జ్ చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot