Redmi 4 పై జియో బంపరాఫర్
రెడ్‌మి 4ఏ, రెడ్‌మి నోట్ 4, రెడ్‌మి 4ల పై ఆఫర్ వర్తింపు....
ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ Xiaomiతో రిలయన్స్ జియో చేతులు కలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా షియోమీ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే యూజర్లకు 30జీబి అదనపు 4జీ డేటాను జియో అందించనుంది. అయితే, ఈ ఆఫర్ ఎంపిక చేసిన షియోమీ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది.

వాటి వివరాలు... రెడ్‌మి 2, రెడ్‌మి 2 ప్రైమ్, ఎంఐ 4ఐ, రెడ్‌మి నోట్ 4జీ, రెడ్‌మి నోట్ 4జీ ప్రైమ్, రెడ్‌మి నోట్ 3, రెడ్‌మి 3ఎస్, రెడ్‌మి 3ఎస్ ప్లస్, రెడ్‌మి 3ఎస్ ప్రైమ్, ఎంఐ 5, ఎంఐ మాక్స్, ఎంఐ మాక్స్ ప్రైమ్, రెడ్‌మి 4ఏ, రెడ్‌మి నోట్ 4, రెడ్‌మి 4. జూన్ 16 తరువాత జియో నెట్‌వర్క్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకున్న కొత్త యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

వీరు ఖచ్చితంగా జియో ప్రైమ్ మెంబర్స్ అయి ఉండాలి. వీరు రూ.309 అంతకంటే ఎక్కువ మొత్తాన్ని రీఛార్జ్ చేసుకున్న ప్రతిసారి 5జీబి అదనపు 4జీ డేటా వీరి అకౌంట్‌లో యాడ్ అవటం జరుగుతుంది. మార్చి 31, 2018లోపు 6 సార్లు ఈ అదనపు డేటా యాడ్ అవుతుంది.


Click it and Unblock the Notifications