Home
Mobile

బ్లాక్‌బస్టర్ డీల్.. నెలకు రూ.862 కడితే చాలు.. Moto G85 5G మీ సొంతం..!

Moto G85 5G: మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. ఇది ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అమెజాన్‌లో ఆకర్షణీయమైన ఆఫర్‌తో అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలో అత్యాధునిక ఫీచర్లను ఆశిస్తున్న వినియోగదారుల కోసం ఈ ఫోన్ ఒక అద్భుతమైన ఎంపిక. శక్తివంతమైన పనితీరు, అత్యుత్తమ కెమెరా సామర్థ్యాలతో కూడిన మోటో G85 5G ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది.

ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉండటంతో, ఏకంగా రూ.4,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అంటే, ఈ ఫోన్‌ని మీరు రూ.16,200లోపే సొంతం చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం పదండి. మోటో G85 5G అసలు ధర రూ.20,999. కాగా అమెజాన్‌లో 15% డిస్కౌంట్‌తో రూ.17,790కే లభిస్తోంది. అంటే దాదాపు రూ.3200 తగ్గింపు ఉంది.

Moto G85 Deal Get 5G Phone for Just Rs 862 Per Month

అంతే కాదు, మీ దగ్గర కొన్ని బ్యాంకు క్రెడిట్ కార్డులు ఉంటే అదనంగా మరో రూ.1,500 డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అంటే అప్పుడు ఈ ఫోన్ ధర కేవలం రూ.16,290 మాత్రమే. ఇంకా తక్కువ ధరకే కావాలనుకుంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేయవచ్చు.

ఫోన్ కండిషన్, మోడల్‌ని బట్టి ఏకంగా రూ.16,750 వరకు తగ్గింపు పొందొచ్చు. అంటే అదృష్టం ఉంటే ఈ ఫోన్ దాదాపు ఫ్రీగా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెలకి రూ.862 నుంచి EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. కొన్ని బ్యాంకు కార్డులపై నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. అంటే దీన్ని చాలా ఈజీగా కొనుగోలు చేయొచ్చు.

* ఫీచర్ల విషయానికొస్తే..
మోటో G85 5Gలో 6.67-అంగుళాల ఫుల్ HD+ కర్వ్డ్ pOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో స్క్రీన్ చాలా స్పష్టమైన దృశ్యాలు చూపిస్తుంది. ఎంత క్వాలిటీలో ఉన్నా సరే వీడియో అసలు స్లో అవ్వకుండా చాలా క్వాలిటీగా కనిపిస్తాయి.

గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటంతో గీతలు, చిన్నపాటి డ్రాప్స్ నుంచి కూడా ఫోన్‌ని కాపాడుతుంది. ఇందులో అందించిన ప్రాసెసర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉండటంతో మల్టీ టాస్కింగ్, గేమింగ్ సమయంలో కూడా ఇబ్బందులు కలగవు.

* బ్యాటరీ బ్యాకప్..
5,000mAh బ్యాటరీ అందించారు కాబట్టి ఈ మొబైల్‌ను రోజంతా హాయిగా వాడుకోవచ్చు. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, కాబట్టి ఛార్జింగ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. IP52 సర్టిఫికేషన్ కూడా ఉంది. అంటే దుమ్ము, నీటి తుంపర్ల నుంచి కూడా ఈ ఫోన్ ని కాపాడుకోవచ్చు.

Take a Poll

* కెమెరాలు
వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫోటోలు చాలా క్లియర్ గా, వివరాలతో వస్తాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు కూడా సూపర్ క్లారిటీతో వస్తాయి. ఫ్యామిలీ కంట్రోల్ ఫీచర్లు, డిజిటల్ వెల్ బీయింగ్ టూల్స్, మల్టీ టాస్కింగ్ ఆప్షన్లు అదనంగా ఉన్నాయి.

అయితే కొన్ని యాప్స్ ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి, నోటిఫికేషన్లు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇది ఒక్కటే చిన్న మైనస్ పాయింట్. మొత్తానికి, బడ్జెట్ ధరలో కర్వ్డ్ OLED డిస్‌ప్లే, మెరుగైన పర్ఫార్మెన్స్, అదిరిపోయే కెమెరాలు కావాలంటే మోటో G85 5G బెస్ట్ ఆప్షన్.

More from GizBot

Best Mobiles in India

English summary
Get 5G Phone for Just Rs 862 Per Month, Moto G85 Deal Will Surprise You
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X