భలే ఛాన్స్..!!

Posted By: Staff

 భలే ఛాన్స్..!!

 

ప్రఖ్యాత మొబైల్ తయారీ బ్రాండ్ లావా వివిధ రకాలైన మొబైల్ ఫోన్‌లను భారత్‌లో లాంచ్ చేసింది. మొబైల్ మార్కెట్లో  సంవత్సరాల కాలంగా పాతుకుపోయిన లావా వినియోగాదారులను ఆకర్షించటంలో తనదైన తీరును కనబర్చింది. మన్నికే ప్రధానంగా ఈ బ్రాండ్ వస్తువులను డిజైన్ చేస్తుంది. భవిష్యత్ కార్యచరణలో భాగంగా ఇంటెల్‌తో జతకట్టిన లావా,  ఇంటెల్ ప్రాసెసర్ ఆధారితంగా పనిచేసే ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్‌  ‘Xolo X900’ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.  అత్యాధునిక స్మార్ట్‌ఫోన్ ఫీచర్లతో రూపుదిద్దుకన్న ఈ డివైజ్ ధర రూ.25,000. Tradus.in వంటి ఆన్‌లైన్ స్టోర్లు తగ్గింపు ధరతో  ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తున్నాయి. ఔత్సాహికులు ‘Xolo X900’ స్మార్ట్ ఫోన్‌ను ఈ ఆన్‌లైన్ రిటైలర్ ద్వారా రూ.22,220కే సొంతం చేసుకోవచ్చు. నెలసరి వాయిదా పద్ధతిలో వీటిని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు.

లావా ‘జోలో900’ ఫీచర్లు:

* 4.3 అంగుళాల హై రిసల్యూషన్ LCD డిస్‌ప్లే,

*    ఇంటెల్ ఆటమ్ Z2460 ప్రాసెసర్, (క్లాక్ సామర్ధ్యం 1.6 GHz),

*    ఉత్తమ క్వాలిటీ కెమెరా వ్యవస్థ,

*    నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ) వ్యవస్థ,

* HSPA + నెట్‌వర్క్ సపోర్ట్,

*   హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,

*   ఇంటెల్ XMM6260 ప్లాట్‌ఫామ్.

ప్రస్తుతానికి ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నప్పటికి త్వరలో 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేట్ కానుంది. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఇంటెల్ ఆటమ్ Z2460 ప్రాసెసర్ పనితీరు పై భారీ అంచనాలు నెలకున్నాయి.

4 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే ఉత్తమ రిసల్యూషన్‌తో కూడిన విజువల్ అనుభూతులను చేరువ చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరా నాణ్యమైన ఫోటోగ్రఫీ ప్రమాణాలను కలిగి ఉంటుంది. ముందు భాగంలో అమర్చిన కెమెరా ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు ఉపకరిస్తుంది. అమర్చిన శక్తివంతమైన బ్యాటరీ సుదీర్ఘ బ్యాకప్ నిస్తుంది. డివైజ్‌లో ఏర్పాటు చేసిన హెచ్‌డిఎమ్ఐ అవుట్ సాయంతో హై డెఫినిషన్ స్ర్కీన్‌లకు స్మార్ట్‌ఫోన్‌ను జత చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot