3డి స్మార్ట్‌ఫోన్ పై 12,000 తగ్గింపు!!

Posted By: Prashanth

3డి స్మార్ట్‌ఫోన్ పై 12,000 తగ్గింపు!!

 

ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే 3డి స్మార్ట్‌ఫోన్‌లలో ప్రధమంగా అందుబాటులోకి వచ్చిన హ్యాండ్‌సెట్ ‘ఎల్‌జీ ఆప్టిమస్ 3డి’.మార్కెట్లో మరిన్ని 3డి ఫోన్‌లు విడుదలైనప్పటికి ఈ ఫోన్ ఉత్తమమైనదిగా మార్కెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఇండియాలో ఈ హై‌ఎండ్ హ్యాండ్‌సెట్ గరిష్ట చిల్లర ధర రూ.37,000 కాగా పలు గ్యాడ్జెట్ స్టోర్‌లలో రూ. 28,000 నుంచి రూ.31,000 ధరలు మధ్య విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ఈ ధరను మరింత తగ్గిస్తూ రూ.24,990కే అమ్ముతున్నారు.

ఎల్‌జీ ఆప్టిమస్ 3డి ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

4.3 అంగుళాల WVGA రిసల్యూషన్ డిస్‌ప్లే,

5 మెగా పిక్సల్ కెమెరా,

హై క్వాలిటీ 3డి ఫీచర్స్,

శక్తివంతమైన మల్టీమీడియా వ్యవస్థ.

ఎల్‌జీ భవిష్యత్ ఫోన్ ‘ఎల్‌జీ ఆప్టిమస్ 3డి మ్యాక్స్’!

‘ఆప్టిమస్ 3డి’కి అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా ‘ఆప్టిమస్ 3డి మ్యాక్స్’ను ఎల్‌జీ రూపొందిస్తుంది. ఈ ఏడాది రెండు లేదా మూడవ క్వార్ట్రర్‌లో డివైజ్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ ఫీచర్లను పరిశీలిస్తే 4.3 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్800 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot