మరో 10 రోజుల్లో రియల్‌మీ P3 ప్రో లాంచ్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో గేమింగ్ బీస్ట్ అనిపించుకుంటుందా?
Realme P3 Pro: రియల్‌మీ సంస్థ మొబైల్ ప్రియులకు, ముఖ్యంగా గేమర్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పింది. సరికొత్త రియల్‌మీ P3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 18న భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకను రియల్‌మీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ చూడొచ్చు. అంతేకాదు, రియల్‌మీ సోషల్ మీడియా పేజీలైన X (ట్విట్టర్), ఫేస్‌బుక్‌లలో కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటుంది.
* రియల్‌మీ P3 ప్రో ఫీచర్లు..
ఇంకా లాంచ్ అవ్వకముందే రియల్‌మీ P3 Pro గురించి కొన్ని అదిరిపోయే ఫీచర్లు బయటకు వచ్చాయి. ఈ ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ఇవ్వనున్నారు. ఇదివరకు వచ్చిన మోడల్స్‌తో పోలిస్తే ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పొచ్చు. ఈ చిప్‌సెట్‌ను TSMC 4nm ప్రాసెస్‌తో తయారు చేశారు.

దీనివల్ల CPU పనితీరు 20% మెరుగుపడుతుంది. అంతేకాదు GPU పనితీరు ఏకంగా 40% వేగంగా ఉంటుందట. అంటే పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ దుమ్ము రేపడం ఖాయం. ముఖ్యంగా గేమ్స్ ఆడేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవ్వచ్చు. బడ్జెట్ కింగ్ గా నిలవచ్చు.
* అదిరిపోయే డిస్‌ప్లే, ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్..
రియల్‌మీ P3 ప్రో ఫోన్‌ను ముఖ్యంగా గేమింగ్ కోసం డిజైన్ చేశారు. ఇందులో క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే ఆఫర్ చేయనున్నారు. దీనివల్ల స్క్రీన్ టచ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ముఖ్యంగా ఎడ్జ్ స్వైప్స్ చాలా ఈజీగా ఉంటాయి. గేమింగ్ లవర్స్‌కి ఇది నిజంగా ఒక గొప్ప ఫీచర్ అనే చెప్పాలి.
* పవర్‌ఫుల్ బ్యాటరీ, క్షణాల్లో ఛార్జింగ్..
రియల్‌మీ P3 ప్రోలో 6,000mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనివల్ల చాలాసేపు ఫోన్ వాడినా చార్జింగ్ అయిపోదు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. అంటే చార్జింగ్ కోసం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. గేమ్స్ ఆడుతూనే ఉండొచ్చు, వీడియోలు చూస్తూనే ఉండొచ్చు.
* కూలింగ్ సిస్టమ్‌తో హీటింగ్ సమస్యకు చెక్..
చాలాసేపు గేమ్స్ ఆడితే ఫోన్ వేడెక్కుతుందా అనే టెన్షన్ వద్దు. రియల్‌మీ P3 ప్రోలో ఏరోస్పేస్-గ్రేడ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను పెట్టారు. ఇది 6,050mm² ఉంటుంది. ఈ కూలింగ్ సిస్టమ్ ఫోన్ వేడెక్కకుండా కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ స్టేబుల్‌గా ఉంటుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ కూడా తగ్గుతాయి.
* ప్రత్యేకమైన గేమింగ్ ఫీచర్లు.. కన్సోల్ గేమింగ్‌ను మరిపిస్తాయి..
Realme P3 Pro ఒక గేమింగ్ ఫోన్ కాబట్టి, ఇందులో GT బూస్ట్ టెక్నాలజీ అనే స్పెషల్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీన్ని BGMI గేమ్ సృష్టికర్తలైన KRAFTONతో కలిసి డెవలప్ చేశారు. ఈ ఫీచర్ గేమ్ ఆడేటప్పుడు కన్సోల్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఇందులో చాలా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి.
వాటిలో AI అల్ట్రా-స్టెడీ ఫ్రేమ్స్ ఒకటి. ఇది గేమ్ ఆడుతున్నప్పుడు ఫ్రేమ్ రేట్ స్మూత్‌గా ఉండేలా చూస్తుంది. మరొకటి హైపర్ రెస్పాన్స్ ఇంజన్, ఇది టచ్ రెస్పాన్స్ స్పీడ్‌ను పెంచుతుంది. అంటే మీరు టచ్ చేసిన వెంటనే యాక్షన్ జరుగుతుంది. AI అల్ట్రా టచ్ కంట్రోల్ కూడా ఉంది. టచ్ కంట్రోల్స్‌ను మరింత కచ్చితంగా చేస్తుంది.
AI మోషన్ కంట్రోల్ ఫీచర్ కూడా అందిస్తున్నారు. జెస్టర్స్‌తో గేమ్ ఆడటానికి వీలు కల్పిస్తుంది. అంటే చేతి కదలికలతోనే గేమ్ ఆడొచ్చు. ఈ ఫీచర్లన్నీ కలిపి రియల్‌మీ P3 Proని ఒక ఈ-స్పోర్ట్స్ లెవెల్ గేమింగ్ ఫోన్‌గా మారుస్తాయి. మొబైల్ గేమింగ్ ప్రపంచంలో ఇది ఒక సంచలనం సృష్టించడం ఖాయం.


Click it and Unblock the Notifications