ఆన్‌లైన్‌లో కొంటే అంత డిస్కౌంట్!

గెలాక్సీ ఏస్ డ్యూయోస్ ఐ59కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా డిజైన్ కాబడిన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏస్ డ్యూయోస్ ఎస్6802 స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ గత మేలో ప్రకటించిన విషయం తెలిసిందే. హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించి నెలరోజులు కావస్తున్నప్పటికి గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు ప్రారంభం కాలేదు. అయితే, పలు ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్థలు ఈ స్మార్ట్‌ఫోన్‌లను భారతీయుల కోసం ప్రత్యేకంగా విక్రయిస్తున్నాయి. గెలాక్సీ డ్యూయోస్ గరిష్ట చిల్లర ధరను రూ.15,050గా సామ్‌సంగ్ ప్రకటించింది. ఇన్ఫీబీమ్ వంటి ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్ధలు ఫోన్ పై 14శాతం రాయితీని కల్పిస్తూ రూ.12,900ల ధరకే అందిస్తున్నాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ డ్యూయోస్ ఎస్6802 కీలక ఫీచర్లు:
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
833 మెగాహెడ్జ్ ప్రాసెసర్,
3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యూయల్ జీఎస్ఎమ్ రేడియోస్,
5 మెగాపిక్సల్ కెమెరా,
సామ్‌సంగ్ టచ్ విజ్ యూజర్ ఇంటర్ ఫేస్,
3జీబి ఇంటర్నల్ మెమెరీ.
సామ్‌సంగ్ డ్యూయల్ సిమ్ ఫోన్ స్టార్ 3 డ్యూయోస్ ప్రధాన విశేషాలు:
డ్యూయల్ సిమ్ సౌలభ్యత,
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోకి ప్రవేశించే సౌలభ్యత,
ఉత్తమ క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్,
వేగవంతమైన ఇంటర్నెట్,
స్టైలిష్ డిజిైనింగ్,
జీఎస్ఎమ్ నెట్‌వర్క్, ఎడ్జ్ బ్యాండ్ సపోర్ట్.
ఫీచర్లు:
తక్కువ బరువు, టీఎఫ్‌టీ QVGA డిస్‌ప్లే, పూర్తి టచ్ స్ర్ర్కీన్, 1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 14.20గంటలు, స్టాండ్‌బై టైమ్ 520 గంటలు), 3మెగా పిక్సల్ కెమెరా (2Xఆప్టికల్ జూమ్, వీడియో రికార్డింగ్), మ్యూజిక్ ప్లేయర్ (3డి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్), ఇన్‌బుల్ట్ వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో (రికార్డింగ్ సౌలభ్యతతో), బ్టూటూత్, వై-ఫై, ఇంటర్నెట్ కనెక్టువిటీ, బాహ్య మెమెరీ సామర్ధ్యం 16జీబి వరకు. ధర రూ. 5,670.


Click it and Unblock the Notifications