ముగ్గులోకి దించడానికి 'ముగ్గురు మొనగాళ్లు'

Posted By: Super

ముగ్గులోకి దించడానికి 'ముగ్గురు మొనగాళ్లు'

'జిఫైవ్ మొబైల్' కంపెనీ ఎప్పుడు మార్కెట్లోకి మొబైల్స్‌ని విడుదల చేసినా కొంచెం హాల్ చల్ చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో జిఫైవ్ మొబైల్స్ తక్కువ ఫీచర్స్ కలిగిన మొబైల్స్‌తో పాటు, హై ఎండ్ మల్టీమీడియా ఉత్పత్తులను కూడా మార్కెట్లోకి విడుదల చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు మరలా జిఫైవ్ మొబైల్ గురించి మాట్లాడుకొవడానికి గల కారణం యూజర్స్ కొసం ఓ అద్బుతమైన గిప్ట్‌తో పాటు, మార్కెట్లోకి మూడు కొత్త మొబైల్స్‌ని విడుదల చేసేందుకు సిద్దమైంది. ఆ మూడు మొబైల్స్ జిఫైవ్ ఈ720, ఈ 780, ఈ 505.

జిఫైవ్ మొబైల్ విడుదల చేయనున్న మొబైల్స్‌లలో అద్బతమైన గిఫ్ట్, ఫీచర్స్ అని అనుకుంటే పొరపాటు బడినట్లే. జిఫైవ్ మొబైల్ ఇవ్వనున్న ఆ అద్బుతమైన గిప్ట్ ఏమిటంటే 'మొబైల్స్‌లలో ఇమడింప జేసిన 20 పుల్ సినిమాలే కస్టమర్స్‌కు ఇచ్చే అతి పెద్ద గిప్ట్' అని జిఫైవ్ మొబైల్ ప్రతినిధులు తెలిపారు. జిపైవ్ మొబైల్స్ ఇండియన్ యూజర్స్‌ని ఎంటర్టెన్మెంట్ చేసేందుకు గాను 4జిబి మెమరీ కార్డులో సినిమాలు, వీడియోలు, సాంగ్స్, రింగ్ టొన్స్ మొదలగున వాటితో అలరించనున్నాయి.

మొదటి హ్యాండ్ సెట్ జిఫైవ్ ఈ 720 మొబైల్‌లో 2.4 ఇంచ్ వెడల్పు కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. మొబైల్ ముందు భాగాన ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కమెరా సహాయంతో చూడచక్కని ఇమేజిలను తీయడమే కాకుండా, మొబైల్ ముందు భాగాన ఉన్న కెమెరాతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొని రావచ్చు. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1300 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్‌తో పాటు కొంత మెమరీ లభిస్తున్నప్పటికీ, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 16జిబి వరకు విస్తరించుకొవచ్చు.

రెండవ మొబైల్ ఈ 780 విషయానికి వస్తే యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.2ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉంది. డేటా ట్రాన్ఫర్ కోసం ఇందులో బ్లూటూత్ ప్రత్యేకం. మార్కెట్లో లభించే రకరకలా మల్టీమీడియా ఫార్మెట్లను ఇది సపోర్ట్ చేస్తుంది. మూడవ మొబైల్ ఈ 505 ముందు చూసిన రెండు మొబైల్స్‌తో పోలిస్తే కొంత ప్రత్యే కం.

2.2 ఇంచ్ డిస్ ప్లే సిస్టమ్‌తో యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుంది. ఇందులో ఉన్న 1.3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. ఈ మొబైల్స్‌లలో ఇమడింప చేసిన సినిమాలను గనుక చూసినట్లైతే ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో సక్సెస్ సాధించిన బ్లాక్ బాస్టర్ సినిమాలనే నిక్షిప్తం చేయడం జరిగింది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సల్మాన్ ఖాన్ దబాంగ్‌తో పాటు, బెంగాలీ, గుజరాత్, పంజాలీ, తెలుగు సినిమాలను నిక్షిప్తం చేశారని సమాచారం. ఇండియన్ మొబైల్ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న ఈ మూడు మొబైల్ ధరలు ఇలా ఉన్నాయి.

జిఫైవ్ ఈ720, ఈ 780, ఈ 505 మొబైల్‌ ధరలు సుమారుగా రూ 2, 000 నుండి రూ 4, 000 వరకు ఉండనున్నాయని సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot