జీ-ఫైవ్ స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By: Prashanth

జీ-ఫైవ్ స్మార్ట్‌ఫోన్‌లు!

 

దేశీయ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ ‘జీ-ఫైవ్’ నాలుగు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఆండ్రాయిడ్ ఆధారిత ఫాబ్లెట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వీటి ధరలు రూ.6,000 నుంచి రూ.12,000మధ్యన ఉంటాయి. ఈ హ్యాండ్ సెట్‌లు 4 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఫాబ్లెట్ 5.3 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా టాబ్లెట్ కంప్యూటర్ లక్షణాలను ఒదిగి ఉన్న ఫాబ్లెట్ (మోడల్ నెంబరు జీ-ఫైవ్ జీ95) ఇండియన్ మార్కెట్ ధర రూ.9,499. నాలుగు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన ‘జీ-ఫైవ్ జీ3డి’ రూ.11,799కి లభ్యమవుతోంది. ఇతర్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లు జీ-ఫైవ్ ఏ79 (రూ.6,999), జీ-ఫైవ్ ఏ86 (రూ.7,999), జీ-ఫైవ్ ఐ88 ( రూ.8,999)కి లభ్యం కానున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లు 8 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉండగా, ఫాబ్లెట్ 5 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఐదు గ్యాడ్జెట్‌లలో రెండు ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. మిగిలిన మూడు ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా స్పందిస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot