ఈ ఫోన్ పై రెండు సంవత్సరాల వారంటీ

సూపర్ కెమెరా, సూపర్ బ్యాటరీ ట్యాగ్‌లైన్‌తో.. జియోనీ కంపెనీ, కొద్ది రోజుల క్రితం మార్కెట్లో లాంచ్ చేసిన Gionee A1 స్మార్ట్‌ఫోన్ మార్చి 31 నుంచి ప్రీ-ఆర్డర్స్ పై లభ్యంకాబోతోంది.

Read More : మార్చి 31 కాదు ఏప్రిల్ 30 వరకు Jio Prime గడువు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్పెషల్ అట్రాక్షన్స్..

18 వాట్ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు శక్తివంతమైన సెల్ఫీ కెమెరాతో వస్తోన్న ఈ ఫోన్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. జియోనీ ఏ1 ఫోన్ ను తొలత 2017, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో విడుదల చేసారు.

రెండు సంవత్సరాల వారంటీ...

ఈ డివైస్ కొనుగోలు పై రెండు సంవత్సరాల వారంటీతో పాటు JBL హెడ్‌ఫోన్, స్విస్ మిలిటరీ బ్లుటూత్ స్పీకర్ వంటి ఆకర్షణీయ బహుమతులను అందించబోతున్నట్లు జియోనీ ప్రకటించింది.

Gionee A1 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ మీడియాటెక్ 6755 హీలియో పీ10 ప్రాసెసర్,

Gionee A1 స్పెసిఫికేషన్స్

4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,010 mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, మైక్రోయూఎస్బీ సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Gionee A1 to be available for Rs 19,999, pre-booking starts from March 31.Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot