జియోని కొత్త ఫోన్ దిగింది
చైనా దిగ్గజం జియోని తన కొత్త ఫోన్ ఏ1 ప్లస్‌ను భారత మార్కెట్లోకి దించింది.
చైనా దిగ్గజం జియోని తన కొత్త ఫోన్ ఏ1 ప్లస్‌ను భారత మార్కెట్లోకి దించింది. 4జిబి ర్యామ్ ,20 ఎంపీ సెల్పీతో వస్తున్న ఈ ఫోన్ ధరను కంపెనీ రూ. 26,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలున్నాయి. దీని ఫీచర్ల విషయానికొస్తే..

ర్యామ్
4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ఎస్డీ కార్డుతో మెమరీ 256జీబీ వరకు విస్తరించుకునేలా కంపెనీ అవకాశం కల్పిస్తోంది.

డిస్‌ప్లే
6 అంగుళాల ఫుల్-హెచ్‌డీ డిస్‌ప్లే, 2.5డీ ప్లస్ గొర్రిల్లా గ్లాస్ 3, హీలియో పీ25 ఆక్టా-కోర్ ప్రాసెసర్, మ్యాక్స్ ఆడియో వాయిస్‌ఓవర్ ఎల్టీఈ

కెమెరా
13 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలున్నాయి.20 ఎంపీ సెల్పీతో ఈఫోన్ వస్తోంది.

బ్యాటరీ
4,550 ఎంఏహెచ్ బ్యాటరీ. తమ అతిపెద్ద బ్యాటరీ ఆల్ట్రాఫాస్ట్ ఛార్జింగ్‌ను ఆఫర్ చేస్తుందని, 300 సెకన్ల ఛార్జింగ్‌తో రెండు గంటల టాక్‌టైమ్‌ను ఇది అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఫింగర్‌ప్రింట్ సెన్సార్
ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కేంద్రప్రభుత్వ ఆదేశాలనుసారం ఈ ఫోన్‌లో పానిక్ బటన్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. మూడు సార్లు హోమ్ బటన్‌ను ప్రెస్ చేస్తే, ఇది యాక్టివేట్ అవుతోంది.

జూలై 26 నుంచి
జూలై 26 నుంచి ఈ ఫోన్ భారత్‌లోని అన్ని రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది.


Click it and Unblock the Notifications








