ఈ ఫోన్‌కి 10 రోజుల్లో రూ. 150 కోట్ల ఆర్డర్లు..

Written By:

మొబైల్స్‌ కంపెనీ జియోనీ ఎ1 సెల్ఫీ పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తున్న స్మార్ట్‌ఫోన్‌కు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. దానికి ఆర్డర్లు బుక్‌ చేసుకోవడం ప్రారంభించిన 10 రోజుల వ్యవధిలోనే 150 కోట్ల రూపాయల విలువ గల ఆర్డర్లు వచ్చాయని, రూ. 8000 నుంచి రూ. 25 వేల రూపాయల ధరల శ్రేణిలో ఒక ఫోన్‌కు ఇంత భారీగా ఆర్డర్లు రావడం ఇదే ప్రథమమని కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్ ధర రూ. 7 వేలు తగ్గింది

ఈ ఫోన్‌కి 10 రోజుల్లో రూ. 150 కోట్ల ఆర్డర్లు..

ఆదివారం నాటికి ఈ ఫోన్‌కు 74,682 హ్యాండ్‌సెట్లకు ఆర్డర్లు లభించినట్టు జియోనీ ఇండియా కంట్రీ సిఇఒ అర్వింద్‌ ఆర్‌ వోహ్రా తెలిపారు. ఇప్పటికే ఎంపిక చేసిన నగరాల్లో ఈ హ్యాండ్‌సెట్‌ డెలివరీ ప్రారంభం కాగా మిగతా నగరాల్లో కూడా ఈ అర్ధరాత్రి నుంచి ఆర్డర్లు స్వీకరిస్తున్నారు. రెండు వేల రూపాయలు చెల్లించి ఆర్డర్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

నోకియా పెను సంచలనం, జియోకి పెద్ద షాక్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది.

4 జీబీ ర్యామ్

4 జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఉంది.

కెమెరా

ప్రత్యేకించి సెల్ఫీ అభిమానుల కోసం ఈ ఫోన్ లాంచ్ చేయడం జరిగింది. 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఈఫోన్ కలిగి ఉంది.

అదనపు ఆకర్షణలు

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4010 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ అదనపు ఆకర్షణలు.

ధర రూ.19,999

ధర రూ.19,999. రెండు వేల రూపాయలు చెల్లించి ఆర్డర్‌ బుక్‌ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Gionee books order worth Rs 150 cr for its A1 selfie phone Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot