జియోనీ ఇలైఫ్ ఇ7 మినీ@రూ.18,999

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోనీ తన సరికొత్త ‘ఇలైఫ్ ఇ7 మినీ' స్మార్ట్‌‍ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.18,999. ఈ డివైస్ ను ముందగా డిసెంబర్ 2013లో ఆవిష్కరించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫ్లిప్ కెమెరా వ్యవస్థ రొటేటింగ్ సామర్థ్యాలను కలిగి క్రియేటివ్ ఫోటోగ్రఫీని మీ సొంతం చేస్తుంది. జియోనీ ఇలైఫ్ ఇ7 మినీ స్మార్ట్‌ఫోన్ పింక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

జియోనీ ఇలైఫ్ ఇ7 మినీ@రూ.18,999

ఫోన్ పరిమాణం 139.8x66.2x8.6 మిల్లీమీటర్లు,బరువు 142.9 గ్రాములు,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,4.7 అంగుళాల ఐపీఎస్ IGZO డిస్ ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),1.7గిగాహెట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,మాలీ 450ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,1జీబి ర్యామ్,13 మెగా పిక్సల్ రొటేటింగ్ కెమెరా (బ్లూ గ్లాస్ ఫిల్టర్ నాణ్యతతో),16జీబి ఇంటర్నల్ మెమరీ,కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, జీపీఎస్, ఏజీపీఎస్కనెక్టువిటీ), 2200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (18 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై టైమ్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot