3జీ ర్యామ్‌తో గియోనీ ఇలైఫ్ ఇ7

|

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ గియోనీ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘ఇలైఫ్ ఇ7'ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 16జీబి మెమరీ వర్షన్ ధరరూ.26,999. 32జీబి వర్షన్ ధర రూ.29,999.

 
3జీ ర్యామ్‌తో గియోనీ ఇలైఫ్ ఇ7

2.2గిగాహెట్జ్ సామర్ధ్యం కలిగిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థను ఈ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. 16జీబి మెమరీ వర్షన్ హ్యాండ్‌సెట్ 2జీబి ర్యామ్‍ను కలిగి ఉంటుంది. 32జీబి మెమరీ వర్షన్ హ్యాండ్‌సెట్‌లో 3జీబి ర్యామ్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. 5.5 అంగుళాల పెద్దదైన తాకేతెరను ఈ హ్యాండ్‌సెట్ కలిగి ఉంది. డిస్‌ప్లే రిసల్యూషన్ సామర్ద్యం 1920 x 1080పిక్సల్స్, 401 పిక్సల్ డెన్సిటీ ఇంకా గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఫీచర్. ఫోన్ వెనుక భాగంలో 16 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కెమెరా తక్కువ వెలుతురులోనూ ఫోటోలను చిత్రీకరించగలదు. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ కెమెరా వీడియో కాలింగ్‌కు దోహదపడుతుంది.

గియోనీ ఇలైఫ్ ఇ7 కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల డిస్‌ప్లే,
2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్ (16జీబి), 3జీబి ర్యామ్ (32జీబి),
సింగిల్ సిమ్,
16 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3.5ఎమ్ఎమ్ ఇయర్ ఫోన్ జాక్,
వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 4.0, ఎఫ్ఎమ్ రేడియో, జీ-సెన్సార్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ),
2500ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X