ప్రపంచపు అతినాజూకైన స్మార్ట్‌ఫోన్ జియోని, ఇలైఫ్ ఎస్5.5
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ జియోని, ఇలైఫ్ ఎస్5.5 ( S5.5) పేరుతో ప్రపంచపు అతినాజూకైన స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ ఏప్రిల్ నాటికి ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ధర అంచనా రూ. 23,000.

ఈ అల్ట్రా సిమ్ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ 5.5మిల్లీమీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది. దింతో ఇలైఫ్ ఎస్5.5 ఫోన్‌ను ప్రపంచపు అతిపలుచటి స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణిస్తున్నారు. 1.7గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ సామర్థ్యం గల కెమెరాను అమర్చారు. వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు ఫోన్ ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేసారు. ఈ ఫ్రంట్ కెమెరా 95 డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను మరోసారి పరిశీలించినట్లయితే:
1.7గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
5.5మిల్లీమీటర్ల మందం,
5 అంగుళాల సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్‌ప్లే (హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో),
రక్షణాత్మకైన గొరిల్లా గ్లాస్ ప్రొటెక్టివ్ స్ర్కీన్,
13 మెగా పిక్సల్ రేర్ కెమరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (95 డిగ్రీలు అల్ట్రా వైడ్ యాంగిల్),
అమిగో ఆపరేటింగ్ సిస్టం (కస్టమైజిడ్ వర్షన్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్),
6జీబి ఇంటర్నల్ మెమరీ,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications