ప్రపంచపు పలుచని స్మార్ట్‌ఫోన్ జియోనీ ఇలైఫ్ ఎస్5.5

|

జియోనీ ఇలైఫ్ ఎస్5.5 పేరుతో ప్రపంచపు అతిపలుచటి స్మార్ట్‌ఫోన్‌ను చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోనీ సోమవారం గోవా వేదికగా ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ధర రూ.22,999.

 

ఏప్రిల్ 27 నుంచి ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతుంది. కేవలం 5.5మిల్లీ మీటర్ల మందాన్ని కలిగి ఉన్న ఈ ఫోన్ ప్రపంచపు అతిపలుచటి స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు నెలకొల్పినట్లు జియోనీ వెల్లడించింది. జియోనీ ఇలైఫ్ ఎస్5.5ను అంతర్జాతీయ మార్కెట్లో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా ఆవిష్కరించారు. డివైస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

ప్రపంచపు పలుచని స్మార్ట్‌ఫోన్ జియోనీ ఇలైఫ్ ఎస్5.5

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‍‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
మాలీ 450-ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ఎల్‌పీడీడీఆర్3 ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్ ఇంకా హైడెఫినిషన్ రికార్డింగ్ సౌకర్యం),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, ఏ-జీపీఎస్, యూఎస్బీ ఆన్ ద గో)

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X