భారీ బ్యాటరీతో వస్తున్న జియోని M7 Power, 15న ముహూర్తం

Written By:

భారీ బ్యాటరీతో చైనా దిగ్గజం జియోని తన సరికొత్త మొబైల్ జియోనీ ఎం7 పవర్‌ని ఇండియాకి తీసుకురాబోతోంది. ఇప్పటికే చైనాలో లాంచ్‌ అయిన ఈఫోన్‌ను జియోనీ 'జియోనీ ఎం7 పవర్‌' త్వరలో మన మార్కెట్‌లోకి వస్తోంది. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్‌కు మద్దతిచ్చే డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌. అంటే వినియోగదారులు రెండు సిమ్ కార్డులు లేదా ఒక సిమ్‌ కార్డు, ఒక మైక్రో ఎస్‌డీ కార్డును వినియోగించవచ్చు.

మీ పాస్‌వర్డ్ గట్టిగా ఉండాలంటే ఈ తప్పులు చేయవద్దు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియోనీ ఎం7 పవర్‌ ఫీచర్లు

6 అంగుళాల ఫుల్ వ్యూ డిస్‌ప్లే
720×1440 పిక్సెల్‌ రిజల్యూషన్‌
1.4 జీహెచ్‌జెడ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌
4 జీబీ ర్యామ్‌,
64 జీబీ స్టోరేజ్‌ (256దాకా విస్తరించుకోవచ్చు)
13 ఎంపీ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్

జియోని ఎం7 పవర్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆధారిత అమిగో ఆపరేటింగ్ సిస్టమ్ 5.0తో పనిచేస్తుంది.

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

స్లోమోషన్‌, గ్రూప్‌ సెల్పీ, ట్రాన్స్‌ లేషన్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్ టెక్నాలజీ ఈ డివైస్‌ అదనపు ఆకర్షణలు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ రూపొందించిన ఈ డివైస్‌ను కంపెనీ ఈ నెల 15న విడుదల చేయనుంది.

ట్విట్టర్‌ ద్వారా ప్రమోషన్‌

ఇప్పటికే ట్విట్టర్‌ ద్వారా ప్రమోషన్‌ ప్రారంభించిన జియోనీ, లాంచింగ్‌ ఈవెంట్‌కు సంబంధించిన ఆహ్వానాలను మీడియాకు పంపింది. దీని ధర సుమారు రూ. 20 వేలుగా ఉండొచ్చని అంచనా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Gionee M7 Power with 5000mAh battery coming to India, launch set for November 15 Read more news at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot