జియోనీ పీ2ఎస్@రూ.6,499
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోనీ ‘పీ2ఎస్'(P2S) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ధర రూ.6,499. వైట్, బ్లాక్, బ్లూ ఇంకా పింక్ కలర్ వేరియంట్‌లో రూపకల్పన చేయబడిన ఈ డివైస్‌లను జియోనీ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. జియోనీ పీ2ఎస్ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.......

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
512ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, బ్లూటూత్, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్,
జీపీఎస్ కనెక్టువిటీ,
1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ బరువు 124 గ్రాములు.
మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతున్న మైక్రోమాక్స్, కార్బన్, లావా, ఇంటెక్స్ తదితర దేశవాళీ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లకు జియోనీ పీ2ఎస్ పోటీగా నిలవనుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








