రెడ్‌మి4కు పోటీగా Gionee X1

షియోమీ రెడ్‌మి 4కు పోటీగా జియోనీ కంపెనీ సరికొత్త ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. జియోనీ ఎక్స్1 పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.8,999.

రెడ్‌మి4కు పోటీగా Gionee X1

Read More : కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 vs లెనోవో కే8 నోట్, ఏది బెస్ట్ ఫోన్?

అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్ లభమ్యవుతుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MT6737 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3,000mAh బ్యాటరీ, 4G VoLTE, బ్లుటూత్, వై-ఫై.

రెడ్‌మి4కు పోటీగా Gionee X1

లాంచ్ ఆఫర్స్ క్రింద ఈ ఫోన్ కొనుగోలు పై ఎయిర్‌టెల్ యూజర్లకు 6నెలల పాటు నెలకు 10జీబి డేటా అదనంగా లభిస్తుంది. ఇదే సమయంలో రెండు పేటీఎమ్ క్యాష్‌బ్యాక్ వోచర్ కోడ్స్ కూడా లభిస్తాయి. 

English summary
Gionee X1 with 8-megapixel selfie camera, fingerprint scanned launched in India, priced at Rs 8,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot