బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ అవార్డ్స్ 2016 (ఏ ఫోన్‌లో ఎంత దమ్ముంది..?)

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో సరికొత్త టెక్నాలజీలను 2016 పరిచయం చేసింది. డ్యుయల్ కెమెరా సెటప్, bezel-less డిస్‌ప్లే, అన్‌లిమిటెడ్ క్లౌడ్ స్టోరేజ్, మాడ్యులర్ సెటప్ వంటి ఎన్నో ప్రత్యేకతలను ఈ ఏడాది లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లలో మనం చూసాం. చిన్న ఫోన్‌ల దగ్గర నుంచి పెద్ద ఫోన్‌ల వరకు ఈ ఏడాది లాంచ్ అయిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పనితీరును నిశితంగా పరిశీలించిన GIZBOT బృందం వాటిని 11 వర్గాలుగా విభజించి అవార్డులను ఇవ్వటం జరిగింది.

Read More : నోకియా నుంచి ఫేస్‌బుక్ వరకు, 2016లో కొనుగోళ్లు ఇవే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, హెచ్‌టీసీ 10

2016కు గాను బెస్ట్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల జాబితాలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, హెచ్‌టీసీ 10లు మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. బెస్ట్ క్వాలిటీ కమెరా, డీసెంట్ బ్యాటరీ బ్యాకప్, స్టెల్లార్ డిస్ ప్లే వంటి అంశాలు గెలాక్సీ ఎస్7ను టాప్ కంటెండర్‌గా నిలబెట్టాయి. మరోవైపు హెచ్‌టీసీ 10 ఫోన్.. రోబస్ట్ డిజైన్, డీసెంట్ బ్యాటరీ లైఫ్ వంటి టాప్ క్లాస్ ఫీచర్లతో రెండవ స్థానంలో నిలిచింది.

 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్

గూగుల్ పిక్సల్ ఎక్స్‌ఎల్, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, యాపిల్ ఐఫోన్ 7 ప్లస్

2016కు గాను బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో గూగుల్ పిక్సల్ ఎక్స్‌ఎల్, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, యాపిల్ ఐఫోన్ 7 ప్లస్ ఫోన్‌లు ప్రముఖ స్థానాలను సొంతం చేుసుకున్నాయి. ముఖ్యంగా డ్యుయల్ కెమెరా సెటప్‌తో లాంచ్ అయిన గూగుల్ సొంత స్మార్ట్‌ఫోన్‌ Pixel XLకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రేటింగ్స్ వ్యక్తవమవుతున్నాయి. మరోవైపు గెలాక్సీ ఎస్7, ఐఫోన్ 7 ప్లస్‌లు తమదైన కమెరా ఫీచర్లతో రన్నరప్‌గా నిలిచాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బెస్ట్ బ్యాటరీ లైఫ్ స్మార్ట్‌ఫోన్

మోటోరోలా మోటో జెడ్ ప్లే, లెనోవో జెడ్2 ప్లస్, యాపిల్ ఐఫోన్ 7 ప్లస్

2016కు గాను బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో మోటరోలా మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. మోటరోలా నుంచి Snapdragon 625 SoCతో మార్కెట్లో లాంచ్ అయిన మోటో జెడ్ ప్లే స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో మొదటి స్థానంలో నిలిచింది. హెవీ యూసేజ్‌లోనూ ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్ 6 గంటలుగా ఉంది. మరోవైపు లెనోవో జెడ్2 ప్లస్ 5 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఆకట్టుకుంది. ఐఫోన్ 7 ప్లస్ కూడా మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

 

బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫాబ్లెట్ ఫోన్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్, ఎల్‌జీ వీ20

2016కు గాను బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫాబ్లెట్ ఫోన్‌ల జాబితాలో గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లు 5.5 అంగుళాల డిస్‌ప్లే సైజు విభాగంలో మొదటి స్థానంలో నిలిచాయి. అత్యుత్తమ డిజైన్, బెస్ట్ కెమెరా, డ్యుయల్ స్ర్కీన్ కస్టమైజేషన్ వంటి అంశాలు ఈ పెద్దతెర ఫోన్‌లను నెం.1 స్థానంలో నిలబెట్టాయి. సామ్‌సంగ్ తరువాతి స్థానాల్లో గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్, ఎల్‌జీ వీ20లు ఓ మోస్తరు క్వాలిటీ స్పెసిఫికేషన్లతో తరువాతి స్థానాల్లో నిలిచాయి.

 

స్మార్ట్‌ఫోన్ విత్ బెస్ట్ క్వాలిటీ డిజైన్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, షియోమీ ఎంఐ మాక్స్

2016కు గాను బెస్ట్ క్వాలిటీ డిజైన్‌తో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 మొదటి స్థానంలో నిలిచింది. గ్లాస్ బ్యాక్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ క్లాసీ లుక్‌తో ఆకట్టుకుంటుంది. మరోవైపు షియోమీ నుంచి లాంచ్ అయిన కాన్సెప్ట్ మోడల్ ఫోన్ Xiaomi's Mi Mix సిరామిక్ బ్యాక్ డిజైన్‌తో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది.

 

తక్కువ రేటింగ్‌ను సొంతం చేసుకున్న స్మార్ట్‌ఫోన్స్

Huawei P9, HTC 10, LG V20

2016కు గాను స్పెసిఫికేషన్స్ పరంగా ఆకట్టుకున్నప్పటికి తక్కువ రేటింగ్‌ను సొంతం చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో హువావే పీ9, హెచ్‌టీసీ 10, ఎల్‌జీ వీ20లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. యునీ మెటల్ బాడీ డిజైన్, హైక్వాలిటీ డ్యుయల్ కెమెరా,  డీసెంట్ బ్యాటరీ లైఫ్ వంటి అంశాలు హువావే పీ9లో ఉన్నప్పటికి మార్కెట్లో క్రేజ్ సంపాదించుకోలేకపోయాయి. మరోవైపు హెచ్‌టీసీ 10 ఎక్కువ ధర ట్యాగ్ ను కలిగి ఉండటం కారణంగా రేసులో వెనుకబడిపోవల్సి వచ్చింది. ఎల్‌జీ తన జీ5 స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్‌ను మెప్పించే ప్రయత్నం చేసినప్పటికి V20 విషయంలో వెనుకంజ వేయవల్సి వచ్చింది.

 

రూ.20,000 నుంచి రూ.30,000 ధరల్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

వన్‌ప్లస్ 3టీ, షియోమీ ఎంఐ 5, లెనోవో జెడ్ 2 ప్లస్

2016కు గాను రూ.20,000 నుంచి రూ.30,000 ధర రేంజ్‌లో OnePlus 3T ఫోన్ మంచి మార్కులన కొట్టేసింది. ఆ తరువాతి స్థానాల్లో షియోమీ ఎంఐ 5, లెనోవో జెడ్2 ప్లస్‌లు నిలిచాయి. Snapdragon 820 చిప్‌సెట్‌తో వస్తోన్న అతిచవకైన స్మార్ట్‌ఫోన్ లెనోవో జెడ్2 ప్లస్ కావటం విశేషం.

 

క్రేజీ ఫోన్స్ ఇవే..

2016కుగాను క్రియేటివ్ ఫీచర్లతో లాంచ్ అయి క్రేజీ ఫీలింగ్‌కు లోనుచేసే ఫోన్‌ల జాబితాలో Xiaomi Mi Mix మొదటి స్థానంలో నిలించింది. bezel-less డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన సాంకేతికతన షియోమీ వినియోగించింది. మరో ఫోన్ హువావే హానర్ మ్యాజిక్ కూడా ఇదే తరహా ఫీచర్లతో మార్కెట్ దృష్టిని తనవైపు తిప్పుకుంది.

నిరుత్సాహపరిచిన ఫోన్‌లు

2016కు గాను ఊరించి ఉసూరుమనిపించిన ఫోన్‌ల జాబితాలో గెలాక్సీ నోట్ 7, యాపిల్ ఐఫోన్ 7, ఎల్‌జీ జీ5లు ఉన్నాయి. బ్యాటరీ ఫెయిల్యుర్ కారణంగా గెలాక్సీ నోట్ 7 వేల కోట్ల నష్టాన్ని మిగల్చగా, ఐఫోన్ 7 సాదాసీదా స్పెసిఫికేషన్‌లతో అంచనాలను అందుకోలేకపోయింది. మరోవైపు ఎల్‌జీ జీ5 ఫేలవమైన బ్యాటరీ బ్యాకప్ కారణంగా నెగిటివ్ టాక్‌ను మూటగట్టుకుంది.

క్రియేటివ్ ఆలోచనలతో దూసుకొచ్చిన ఫోన్‌లు

2016కు గాను క్రియేటివ్ ఆలోచనలతో దూసుకొచ్చిన ఫోన్‌ల జాబితాలో Nextbit Robin ఫోన్ మొదటి స్థానంలో నిలిచింది. క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్‌తో లాంచ్ అయిన ఈ ఫోన్ స్టోరేజ్ సమస్యలకు ఓ పరిష్కారం చూపించింది. మరోవైపు మోటోరోలా మోటో జెడ్, ఎల్‌జీ జీ5 ఫోన్‌లు ప్రత్యేకమైన మాడ్యుల్స్‌తో ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేసాయి.

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌

2016కు గాను బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ జాబితాలో షియోమీ రెడ్మీ నోట్ 3 మొదటి స్థానంలో నిలిచింది. రూ.10,000 ధర పరధిలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్ కూడా ఇదే కావటం విశేషం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
GIZBOT Awards: Best Smartphones of 2016 Under Each Category. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot