గిజ్‌బాట్ గివ్ఎవే కాంటెస్ట్: గెలుచుకోండి ఎల్‌జి ఎల్90 డ్యుయల్ స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా

|

టెక్నాలజీ ప్రియులను ఉత్తేజితులను చేస్తూ ప్రముఖ టెక్నాలజీ పోర్టల్ గిజ్‌బాట్ మరో గివ్ఎవే (Giveaway) కాంటెస్ట్‌తో పాఠకుల ముందుకు వచ్చింది. ఎల్‌జి నుంచి తాజాగా విడుదలైన సంచలనాత్మక స్మార్ట్‌ఫోన్ ఎల్‌జి ఎల్90 డ్యుయల్‌ను ఈ పోటీలో గెలుపొందే విజేత సొంతం చేసకుంటారు. గిజ్‌బాట్, ఎల్‌జి ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో ఈ కాంటెస్ట్‌ను నిర్వహించటం జరుగుతోంది.

 
గిజ్‌బాట్ గివ్ఎవే కాంటెస్ట్: గెలుచుకోండి ఎల్‌జి ఎల్90 డ్యుయల్

ఎల్‌జి ఎల్90 డ్యుయల్ స్మార్ట్‌ఫోన్‌‌కు సంబంధించి పనితీరును విశ్లేషించినట్లయితే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ పై స్పందిస్తుంది. అలాగే, క్నాక్ కోడ్ ( Knock Code) పేరుతో ప్రత్యేకమైన ఫీచర్‌ను ఎల్‌జి ఈ డివైస్‌లో పొందుపరిచింది. ఈ ఫీచర్ పూర్తిస్థాయి రక్షణ వ్యవస్థను కలిగి ఫోన్ సెక్యూరిటీ స్థాయిని మరింత సమర్థవంతం చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఎల్‌జి ఎల్90 డ్యుయల్ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.19,000. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఎల్‌జి ఎల్90 డ్యుయల్ ఉత్తమ ఎంపిక.

a Rafflecopter giveaway

ఎల్‌జి ఎల్90 డ్యుయల్ స్మార్ట్‌ఫోన్‌ కీలక స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ టచ్ ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
క్నాక్ కోడ్ ఫీచర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ ప్రత్యేకతలతో)
1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్,
3జీ హెచ్ఎస్‌పీఏ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ వీ4.0 విత్ ఏ2డీపీ, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, జీపీఎస్/ఏజీపీఎస్,
2540ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

గిజ్‌బాట్ గివ్ఎవే కాంటెస్ట్‌కు సంబంధించి నియమ నిబంధనలు:

విజేత ఎంపిక యాదృచ్ఛికంగా ఉంటుంది. ఒక విజేత ఒక ఎల్‌జి ఎల్90 డ్యుయల్ స్మార్ట్‌ఫోన్‌‌ను సొంతం చేసుకుంటారు. విజేత ఎంపిక పైన జత చేసిన రాఫిల్‌కాప్టర్ విడ్జెట్‌లో నమోదైన డేటా ఆధారంగా ఉంటుంది. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మరికొంత మందికి షేర్ చేయటం ద్వారా పోటీదారు అదనపు పాయింట్లను గెలుచుకోగలుగుతారు. ఫేక్ ఐడీలను పరిగణంలోకి తీసుకోరు. పోటీలో పాల్గొనే యూజరు తన ఈ-మెయిల్ అడ్రస్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సోర్స్ ఆధారంగానే గిజ్‌బాట్ బృందం వారిని సంప్రదిస్తుంది.

తప్పనిసరిగా పాటించవల్సిన ఆప్షన్, ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ఔత్సాహికులు గిజ్‌బాట్, ఎల్‌జి ఇండియాలకు సంబంధించిన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లను 'Like' ఇంకా 'Follow' చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఒక్కో అభ్యర్థి 10 అదనపు పాయింట్లను సొంతం చేసుకుంటారు. హాష్ ట్యాగ్ # GizbotGiveaway.

 

మీరు గెలుపొందినట్లయితే మీ ఈ-మెయిల్ అడ్రస్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తాం. ఏడు రోజులలోపు మీరు ప్రతిస్పందిచాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరు స్పందిచనట్లయితే విజేతగా వేరొకరని ఎంపిక చేస్తాం. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే అభ్యర్థులు వారి పూర్తి పేరు అలానే ఈ-మెయిల్ లేదా ఫేస్‌బుక్ లాగిన్‌ను పొందుపరచాల్సి ఉంటుంది.

బహుమతిగా ప్రధానం చేయబోయే ఎల్‌జి ఎల్90 డ్యుయల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి వారంటీలు, కస్టమర్ సర్వీస్ ఇంకా ఎక్స్‌చేంజ్‌లకు సంబంధించి ఎల్‌జి లేదా గిజ్‌బాట్‌కు ఏ విధమైన బాధ్యత ఉండదు.

ఈ కాంటెస్ట్ మే 18 వరకు కొనసాగుతుంది. కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్!!

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/t1fS-A4vfLw?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X