యూసీ క్లీనర్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.. గెలాక్సీ ఎస్6ను గెలుచుకోండి

Posted By:

హాయ్, గిజ్‌బాట్ రీడర్స్! మీ కోసం మరో అద్భుతమైన కాంటెస్ట్ ఎదురుచూస్తోంది. ఈ పోటీలో మీరు గెలిపొందినట్లయితే ఖరీదైన స్మార్ట్‌ఫోన్ మీ సొంతమవుతుంది. యూసీ బ్రౌజర్ ఇండియా సహకారంతో గిజ్‌బాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ గివ్ఎవే కాంపీటిషన్‌లో గెలుపొందిన విజేతకు ప్రపంచపు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6ను బహుమతిగా ప్రధానం చేయటం జరుగుతుంది.

ప్రముఖ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్‌లో ఒకటైన యూసీ బ్రౌజర్, వేగవంతమైన బ్రౌజర్ మాత్రమే కాదు అత్యుత్తమ యూజర్ ఇంటర్ ఫేస్‌తో రూపుదిద్దుకున్న ఇంటర్నెట్ ముఖ ద్వారం.

 యూసీ క్లీనర్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.. గెలాక్సీ ఎస్6ను గెలుచుకోండి

తాజాగా యూసీ వెబ్ ‘యూసీ క్లీనర్' పేరుతో సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ పై పడుతున్న ఒత్తిడిని ఎప్పటికప్పుడు తగ్గిస్తూ పేరుకుపోయిన జంక్ ఫైళ్లను క్రమం తప్పకుండా క్లీన్ చేస్తుంది. యూసీ క్లీనర్ యాప్ చాలా సాధారణమైన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ 4.1 ఆ తరువాతి వర్షన్‌లను సపోర్ట్ చేస్తుంది. యూసీ క్లీనర్ యాప్‌లో పొందుపరిచిన సూపర్ బూస్టర్ ఫీచర్స్ స్మార్ట్‌ఫోన్‌లోని ఆటో-స్టార్ట్ యాప్స్‌ను డిసేబుల్ చేసేస్తాయి. అంతేకాకుండా.. బ్యాటరీ, డేటా ఇంకా స్టారేజ్ వినియోగాన్ని విశ్లేషణ చేస్తూ ఫోన్ పని తీరుతో పాటు స్టోరేజ్ స్పేస్‌ను పెంచే ప్రయత్నం చేస్తాయి.

కాబట్టి గిజ్ బాట్ పాఠకులారా, యూసీ క్లీనర్ యాప్ ను మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను పరీక్షించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ‘యూసీ క్లీనర్' యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూసీ బ్రౌజర్ ఇండియా సహకారంతో గిజ్‌బాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న GizBot Giveaway కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు ఈ క్రింది సూచనలను అనుసరించండి..

కాంటెస్ట్‌లో ఏలా పాల్గొనాలి..?

స్టెప్ 1: ముందుగా మీ ఫేస్‌బుక్ లేదా ఈమెయిల్ ఐడీ ద్వారా GizBot Giveaway పోటీలోకి లాగిన్ కండి.

స్టెప్ 2: Rafflecopter విడ్జెట్‌లోని ప్రతి నిబంధనను అనుసరిస్తూ గరిష్ట స్కోర్లను పొందండి.

స్టెప్ 3: గిజ్‌బాట్, యూసీ బ్రౌజర్ ఇండియా - ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి.

స్టెప్ 4: ఈ GizBot Giveaway కాంటెస్ట్‌కు సంబంధించి వివరాలను ట్విట్టర్, ఫేస్‌బుక్, ఈమెయిల్ ఇంకా ఇతర లింక్స్ ద్వారా తమ మిత్రులకు షేర్ చేయటం ద్వారా బోనస్ ఎంట్రీలతో పాటు స్కోర్‌‍ను పొందవచ్చు.

స్టెప్ 5: UC Cleaner appను డౌన్ లోడ్ చేసుకోవాలి.

a Rafflecopter giveaway

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 స్పెసిఫికేషన్‌లు

5.1 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ (2560×1440పిక్సల్స్) 577 పీపీఐ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆక్టా-కోర్ (క్వాడ్ 2.1గిగాహెర్ట్జ్ + క్వాడ్ 1.5గిగాహెర్ట్జ్) ఎక్సినోస్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ఓఐఎస్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఎస్ హెల్త్ 4.0, హార్ట్ రేట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ/ 3జీ హెచ్‌ఎస్‌‍పీఏ+, వై-ఫై, బ్లూటూత్ 4.1, ఎన్ఎఫ్‌సీ,
2,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ గివ్‌ఎవే నిబంధనలు

విజేత ఎంపిక యాదృచ్ఛికంగా ఉంటుంది: ఎంపిక కాబడిన విజేతకు ఒక (1) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. విజేత ఎంపిక పైన జత చేసిన రాఫిల్‌కాప్టర్ విడ్జెట్‌లో నమోదైన డేటా ఆధారంగా ఉంటుంది. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మరికొంత మందికి షేర్ చేయటం ద్వారా పోటీదారు అదనపు పాయింట్లను గెలుచుకోగలుగుతారు. ఫేక్ ఐడీలను పరిగణంలోకి తీసుకోరు. పోటీలో పాల్గొనే యూజరు తన ఈ-మెయిల్ అడ్రస్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సోర్స్ ఆధారంగానే గిజ్‌బాట్ బృందం వారిని సంప్రదిస్తుంది.

తప్పనిసరి ఆప్షన్ : ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ఔత్సాహికులు గిజ్‌బాట్, యూసీ బ్రౌజర్ ఇండియాలకు సంబంధించిన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లను 'Like' ఇంకా 'Follow' చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఒక్కో అభ్యర్థి 10 అదనపు పాయింట్లను సొంతం చేసుకుంటారు. హాష్ ట్యాగ్ #GizbotGiveaway

మీరు గెలుపొందినట్లయితే : మీ ఈ-మెయిల్ అడ్రస్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తాం. ఏడు రోజులలోపు మీరు ప్రతిస్పందిచాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరు స్పందిచనట్లయితే విజేతగా వేరొకరని ఎంపిక చేస్తాం. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే అభ్యర్థులు వారి పూర్తి పేరు అలానే ఈ-మెయిల్ లేదా ఫేస్‌బుక్ లాగిన్‌ను పొందుపరచాల్సి ఉంటుంది.

బహుమతిగా ప్రధానం చేయబోయే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 స్మార్ట్‌ఫోన్‌ వారంటీ, ఎక్స్‌చేంజ్‌ ఇంకా కస్టమర్ సర్వీసుకు సంబంధించి జియోని లేదా గిజ్‌బాట్‌కు ఏ విధమైన బాధ్యత ఉండదు. ఈ పోటీ జూలై 6, 2015 వరకు కొనసాగుతుంది. బెస్ట్ ఆఫ్ లక్!

English summary
Hey, GizBot readers! Once again we are back with an exciting chance for you to win another amazing smartphone from GizBot sponsored by UC Browser India.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot