శ్యామ్‌సంగ్ గెలాక్సీ 3డి ఎక్స్ పీరియన్స్ కావాలా..?

Posted By: Staff

శ్యామ్‌సంగ్ గెలాక్సీ 3డి ఎక్స్ పీరియన్స్ కావాలా..?

ప్రస్తుతం హాలీవుడ్లో విడుదలయ్యే ప్రతి బ్లాక్ బస్టర్ కూడా 3డిలోకి వస్తున్న విషయం తెలిసిందే. విజుల్ వరల్డ్‌లో 3డి అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లైతే ఈరోజుల్లో మార్కెట్లోకి వస్తున్నటువంటి టెలివిజన్ సెట్స్, లాప్ టాప్స్, డెస్క్ టాప్స్ అన్నింటిలో కూడా 3డి ఓ భూమికను పోషిస్తుంది. ఇప్పుడు ఈ 3డి జబ్బు మొబైల్ ఫోన్స్‌కి కూడా తాకింది. శ్యామ్‌సంగ్ కంపెనీ త్వరలో విడుదల చేయనున్న స్మార్ట్ ఫోన్ శ్యామ్‌సంగ్ గెలాక్సీ 3డి యూజర్స్‌ కు చక్కని విజులవల్ ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుందని తెలియజేశారు.

ఐతే ఇక్కడ కస్టమర్స్‌‌కి ఓ క్వచ్చన్ వచ్చే అవకాశం ఉంది. అదేమిటంటే ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో అసలు 3డి కంటెంట్ దోరుకుతుందంటారా.. ఖచ్చితంగా ఇప్పుటికే ఎల్‌జీ లాంటి మొబైల్ తయారీ దారు కంపెనీలు 2డి కంటెంట్‌ని 3డి లోకి అనువదించే అప్లికేషన్స్‌ని రూపోందించడం జరిగింది. అసలు స్మార్ట్ ఫోన్స్ రంగం 3డి ఎక్స్ పీరియన్స్ లోకి రావడం అనేది కస్టమర్స్‌కి ఓ నూతన ప్రపంచాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతోనే అని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలై మంచి సేల్స్‌ నమోదు చేసిన 3డి మొబైల్ ఫోన్స్ ఎల్‌జీ ఆప్టిమస్ 3డి, హెచ్‌‌టిసి ఈవో 3డిలు మార్కెట్లో హాల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

వాటిని దృష్టిలో పెట్టుకోని శ్యామ్‌సంగ్ మార్కెట్లోకి తన సొంత్ 3డి మొబైల్ పోన్‌ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. దానిపేరే శ్యామ్‌సంగ్ గెలాక్సీ 3డి. శ్యామ్‌సంగ్ గెలాక్సీ 3డి స్పెషాలిటీ ఏమిటంటే ఇందులో 3డి కంటెంట్‌ని చూడడానికి ఎటువంటి కళ్ల జోడు అవసరం లేదు. ఈ సమాచారం అంతా ఓ ప్రముఖ వెబ్ సైట్‌లో ప్రచురించడం జరిగింది. అందుకే దీనిని మేము మీకు అందిస్తున్నాం. కానీ శ్యామ్‌సంగ్ గెలాక్సీ 3డి విడుదలపై శ్యామ్‌సంగ్ మాత్రం ఎటువంటి కన్పర్మ్ చేయలేదు.

శ్యామ్‌సంగ్ గెలాక్సీ 3డి 1.2 or 1.4 GHz ప్రాసెసర్‌ని కలిగి ఉండి హై స్పీడ్ RAMతో పని చేస్తుందని అంచనా. ఇక కెమెరా విషయానికి వస్తే హై డెపినేషన్ 3డి కంటెంట్‌ని యాక్సెస్ చేసుకునేందుకు, చక్కని ఇమేజీలను తీసేందుకు గాను ఇందులో 8 మెగా ఫిక్సల్ కెమెరాని అమర్చడం జరిగింది. అంతేకాకుండా ఎల్‌ఈడి ప్లాష్, ఆటో ఫోకస్ కూడా దీని ప్రత్యేకం. ఇందులో ఇంటర్నల్‌గా స్టోరేజి కెపాసిటీ ఉన్నప్పటికీ, మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని ఎక్సాండ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 3డి మొబైల్ ఫోన్స్ ఎల్‌జీ ఆప్టిమస్ 3డి, హెచ్‌టిసి ఈవో 3డి మొబైల్ ఫోన్స్ కంటే కూడా బెటర్‌గా ఫెర్పామెన్స్ ఉండేందుకు గాను దీనిలో ఆండ్రాయిడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ జింజర్ బ్రెడ్‌తో రూపొందించడం జరిగింది. ఇన్ని రకాలైనటువంటి ఫీచర్స్‌తో విడుదలే చేస్తున్నటువంటి ఈ 3డి మొబైల్ పోన్ ఖరీదు కూడా కొంచెం ఎక్కువగానే ఉండవచ్చునని అంటున్నారు. శ్యామ్‌సంగ్ గెలాక్సీ 3డి మొబైల్ పోన్‌ని వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ షో 2011లో ప్రవేశపెట్టిన తర్వాత దీనియొక్క విడుదల తేదీ, ధరను ప్రకటిస్తారని తెలియజేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot