Home
Mobile

రూ.1299 ధరకు 75 గంటల ప్లేటైంతో ఇయర్‌బడ్స్‌.. ఆకట్టుకొనే డిజైన్‌ సహా..!

భారత్‌ మార్కెట్‌ లో అనేక సంస్థలు వివిధ ఆడియో ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. తాజాగా గౌబౌల్ట్‌ సంస్థ ఇయర్‌బడ్స్‌ ను లాంచ్ చేసింది. గోబౌల్ట్‌ టెనెట్‌ పేరుతో TWS బడ్స్‌ను (GoBoult Tenet TWS Earbuds) విడుదల చేసింది. ఈ TWS ఇయర్‌బడ్స్‌ ను వంద శాతం భారత్‌ లోనే రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఈ ఇయర్‌బడ్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ను సపోర్టు చేస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌ తో ఏకంగా 75 గంటల ప్లేటైమ్‌ ను అందిస్తుందని తెలిపింది. ఈ బడ్స్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, ధర వివరాలు.

ప్రత్యేక డిజైన్‌ :
ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకమైన డిజైన్‌ తో అందుబాటులోకి వచ్చాయి. భారతీయ యూజర్లకు మరింత వినూత్నమైన డిజైన్‌ లతో కూడిన ఆడియో ఉత్పత్తులను అందించాలని భావిస్తున్నట్లు ఈ బ్రాండ్‌ చెబుతోంది. ఈ బడ్స్ ఫ్లాట్‌ టాప్‌ కేస్‌, బోల్డ్‌ జామెట్రీని డిజైన్‌ ను కలిగి ఉంది.

GOBoult Tenet tws earbuds

సౌకర్యవంతమైన డిజైన్‌ :
రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకొని డిజైన్‌ చేసినట్లు సంస్థ చెబుతోంది. వేలాది ఇయర్‌ ఇన్‌లెట్‌ లను LiDAR స్కానింగ్‌ చేసి డిజైన్‌ రూపొందించినట్లు తెలిపింది. ఫలితంగా సౌకర్యవంతంగా ఉంటాయని చెబుతోంది.

ట్రైఆర్క్‌ కేస్‌ డిజైన్‌ :
గోబౌల్ట్‌ టెనెట్ ఇయర్‌బడ్స్ ట్రై ఆర్క్‌ కేస్‌ డిజైన్‌ ను కలిగి ఉంది. భారీ బ్యాటరీని అమర్చేందుకు వీలుగా ఈ డిజైన్‌ ఎంచుకున్నట్లు చెబుతోంది. తన ఆడియో ఉత్పత్తుల్లో డిజైన్‌ కు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సంస్థ చెబుతోంది.

ENC, లోలేటెన్సీ :
గోబౌల్ట్‌ టెనెట్ ఇయర్‌బడ్స్‌ 13mm డైనమిక్ డ్రైవర్‌ లను కలిగి ఉంది. ENC (ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌) తో కూడిన క్వాడ్‌ మైక్‌ ను కలిగి ఉంది. వాయిస్‌ కాల్స్‌ సమయంలో సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. అల్ట్రా లోలేటెన్సీ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. గేమింగ్‌ సమయాల్లో ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. IPX5 రేటింగ్‌ తో వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

సింగిల్‌ ఛార్జింగ్‌తో 75 గంటల ప్లేటైం :
ఈ బడ్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ను సపోర్టు చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి ఏకంగా 75 గంటల ప్లేటైమ్‌ ను పొందుతుందని గోబౌల్ట్‌ చెబుతోంది. ఈ బడ్స్‌ LED ఇండికేటన్‌ ను కలిగి ఉంది. ఈ బడ్స్‌ డ్యూయల్‌ డివైజ్‌ కనెక్టివిటీ సపోర్టు ఉంది.

ఇయర్‌బడ్స్‌ ధర, సేల్‌ వివరాలు :
గోబౌల్ట్‌ టెనెట్‌ TWS ఇయర్‌బడ్స్‌ ప్రారంభ ధర రూ.1299 గా ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ ఇయర్‌బడ్స్ సోలార్‌ యెల్లో, మిడ్‌నైట్‌ బ్లూ, టర్బో ఆరెంజ్, నియాన్‌ లైమ్‌ కలర్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది.

ఈ గోబౌల్ట్‌ టెనెట్‌ ఇయర్‌బడ్స్‌ సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందనే వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఈ ఇయర్‌బడ్స్‌ గోబౌల్ట్ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా సహా ఇతర స్టోర్స్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. త్వరలో సేల్‌ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
GOBoult Tenet tws earbuds with 75 hour of playtime launched in india full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X