భారత్‌‍లోకి గోల్డ్ వేరియంట్ సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2

Posted By:

సామ్‌సంగ్ ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించిన ‘గెలాక్సీ గ్రాండ్ 2' గోల్డ్ వేరియంట్ ఎడిషన్ తాజాగా సామ్‌సంగ్ ఇండియా అధికారిక ఆన్‌లైన్  స్టోర్‌లో ప్రత్యక్షమైంది. ధర రూ.20,900. ప్రస్తుతానికి స్టాక్ అందుబాటులో లేదు. వివరాల్లోకి వెళితే గెలాక్సీ గ్రాండ్ 2 స్మార్ట్‌ఫోన్ ముందుగా 2014 జనవరిలో ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. వైట్, బ్లాక్ ఇంకా పింక్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. గెలాక్సీ గ్రాండ్ 2' గోల్డ్ వేరియంట్ ఎడిషన్ ఇప్పటికే మలేషియా ఇంకా నేపాల్ మార్కెట్లలో లభ్యమవుతోంది. సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

భారత్‌‍లోకి గోల్డ్ వేరియంట్ సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2

5.2 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, ఆటో ఫోకస్ ఇంకా ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot