నోకియా గురించి మరో హాట్ న్యూస్

ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లతో, 2017లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నోకియా గురించి మరో హాట్ న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం నోకియా తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ముందు కొన్ని ఐకానిక్
ఫీచర్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది..

Read More : జనవరిలోనే జియో రూ.1000 ఫోన్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్ఎమ్‌డి గ్లోబల్ సీఈఓ

ఈ వివరాలను స్వయంగా హెచ్ఎమ్‌డి గ్లోబల్ సీఈఓ ఆర్టో నుమిల్లా ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. నోకియా బ్రాండెడ్ ఫోన్ తయారీ హక్కులను మైక్రోసాఫ్ట్ వద్ద నుంచి హెచ్ఎమ్‌డి గ్లోబల్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

భారత్‌లో మంచి డిమాండ్

3జీ ఫోన్‌లలో Jio 4G వాడటం ఎలా..?

ఫీచర్ ఫోన్‌లకు భారత్‌లో మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నోకియా నుంచి వెలువడిన, ఈ ప్రకటనకు ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకుంది.

మార్కెట్లో నిలదొక్కునేందుకు విశ్వప్రయత్నాలే..

1990 - 2000 మధ్య సంచలనం రేపిన నోకియా ఫోన్‌లను పలు అప్‌డేట్‌లతో తిరిగి మార్కెట్లో లాంచ్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదేమైనప్పటికి తిరిగి మార్కెట్లో నిలదొక్కునేందుకు నోకియా విశ్వప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐఫోన్ vs నోకియా...

కొత్త ఫోన్‌లతో జాగ్రత్త.. ఓవర్ హీట్ అవుతున్నాయ్!

వేలకు వేలు విలువ చేసే ఐఫోన్‌లు బెస్టా..? వందల్లో ఖరీదు చేసే నోకియా ఫోన్‌ల బెస్టా అంటే..? నోకియా ఫోన్ బెస్ట్ అంటున్నారు పలువురు యూజర్లు. ఐఫోన్ గొప్పదా లేక నోకియా 1100 గొప్పదా అనే విషయంలో కొంతమంది విశ్లేషకులు కొన్ని రకాల వాస్తవాలను ఇచ్చారు. చాలా సరదాగా ఉన్నాయి. అవేంటే మీరే చూడండి...

నెల జీతం అక్కర్లేదు..

నోకియా ఫోన్ కొనేందుకు మీరు మీ నెల జీతాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఐఫోన్‌కి జీతం పణంగా పెట్టాలి. దాని మెయింటెనెన్స్ కి కూడా బాగా పెట్టాలి.

పోతో బాధపడాల్సిన అవసరం లేదు..

ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్.. సంవత్సరం పాటు ఉచితం?

ఒక వేళ నోకియా ఫోన్ మీరు ఎక్కడైనా పోగొట్టుకుంటే బాధపడాల్సిన అవసరం ఉండదు. అదే ఐ ఫోన్ అయితే ఊహకే అందని విషయం.

స్కేక్ గేమ్ గుర్తుందా..?

మీ స్మార్ట్‌ఫోన్ పొరపాటున చేయి జారి కిందపడితే ఇక అంతే సంగతులు..అదే నోకియా ఎంత ఎత్తునుంచి పడినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు స్కేక్ గేమ్ ఒక్క నోకియా 1100 ఫోన్ లో మాత్రమే ఆడగలరు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వానలో తడిసినా సమస్య ఉండదు

వానలో తడిసినా కూడా నోకియా 1100 ఏమి కాదు. అదే ఐ ఫోన్ అయితే ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందే. నోకియా ఫోన్ లలో వైరస్ అటాక్ అన్న సమస్యే ఉండదు. ఐఫోన్ యూజర్లకు వైరస్ బెడద తప్పదు.

ఎటువంటి టెన్షన్ ఉండు..

నోకియా 1100 ఫోన్లతో జీవితం ఎటువంటి టెన్సన్ లేకుండా హాయిగా సాగుతుంది. అదే ఐ ఫోన్ అయితే ఈ మెయిల్స్ వాట్సప్ ఫేస్ బుక్ ఇలా పిచ్చి లేస్తుంటుంది. నోకియా ఫోన్ ఎంత ఎత్తు నుంచి పడినా కాని దాన్ని మళ్లీ వాడుకోవచ్చు. అది నార్మల్ గా పనిచేస్తుంది. అదే ఐ ఫోన్ అయితే ఇక అంతే సంగతులు.

ఆయుధంగా వాడుకోవచ్చు..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన తరువాత కూడా దాన్ని మీరు ఓ ఆయుధంగా వాడుకోవచ్చు. దీనిలో టార్చ్ లైట్ మీ బ్యాటరీని అసలు తినేయదు. అలాగే మీకు ఎటువంటి నష్టం కలిగించదు.

పవర్‌ఫుల్ బ్యాటరీ..

నోకియా బ్యాటరీ పుల్ చార్జింగ్ పెడితే మీకు మళ్లీ ఛార్జింగ్ పెట్టేదానికి రెండు మూడు రోజులయినా పడుతుంది. బ్యాటరీని ఛార్జింగ్ ఎప్పుడుపెట్టానని అడడొచ్చు ఫన్నీగా. నోకియా ఫోన్ కీ ప్యాడ్ కి అలవాటు పడిన వారికి ఐ ఫోన్ కీ ప్యాడ్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

సిగ్నల్స్ లేవు అన్న సమస్యే ఉండదు...

నోకియా ఫోన్‌లో అన్ని రకాల సిమ్ కార్డులు వాడుకోవచ్చు.అదే ఇతర ఫోన్లకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. నోకియా 1100కి ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు. అలాగే సేఫ్ కవర్స్ కూడా అవసరం లేదు. సిగ్నల్స్ లేవు అన్న సమస్యే ఉండదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Good News: Nokia Feature Phones to Be Launched Before Android Smartphones in 2017. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot