గూగుల్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ఆండ్రాయిడ్ లాలీపాప్

Posted By:

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ 2014కుగాను మూడు సరికొత్త గూగుల్ నెక్సుస్ ఉత్పత్తులతో పాటు ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం (లాలీపాప్)ను ఓ బ్లాగ్ పోస్ట్ ద్వారా ఆవిష్కరించింది. త్వరలో మార్కెట్లో విడుదల కానున్న ఈ ఉత్పత్తుల వివరాలు నెక్సుస్ 6 (స్మార్ట్ ఫోన్), నెక్సుస్ 9 (టాబ్లెట్), నెక్సుస్ ప్లేయర్‌గా ఉన్నాయి. నెక్సుస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా భాగస్వామ్యంతో, నెక్సుస్ 9 టాబ్లెట్‌ను హెచ్‌టీసీ సహకారంతో గూగుల్ వృద్థి చేసింది. యాపిల్ కొత్త ఉత్పత్తుల నుంచి ఎదురువుతున్న తీవ్ర పోటీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ నెక్సుస్ బ్రాండ్ ఉత్పత్తులు ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 5 లాలీపాప్' పై రన్ అవుతాయి.

 గూగుల్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ఆండ్రాయిడ్ లాలీపాప్

ముందుగా గూగుల్ నెక్సుస్ 6 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు:

5.93 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 2,560x1,440పిక్సల్స్, 493 పీపీఐ పిక్సల్ డెన్సిటీతో), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ ఎల్), క్వాడ్‌కోర్ సీపీయూ, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 13 మెగాపిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంకా డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యాలతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ధర ఇంకా అందుబాటు:

యూఎస్ మార్కెట్లో గూగుల్ నెక్సుస్ 6 32జీబి సిమ్-ఫ్రీ వర్షన్ ధర 649 డాలర్లు (మన కరెన్సీ ప్రకారం రూ.39,939). ఈ డివైస్‌కు సంబంధించి ముందస్తు బుకింగ్‌లను అక్టోబర్ 29 నుంచి గూగుల్ ప్రారంభించే అవకాశముంది. మిడ్‌నైట్ బ్లూ ఇంకా క్లౌడ్‌వైట్ వేరియంట్‌లలో నెక్సుస్ 6 స్మార్ట్‌ఫోన్ లభ్యంకానుంది.

 గూగుల్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ఆండ్రాయిడ్ లాలీపాప్

గూగుల్ నెక్సుస్ 9 టాబ్లెట్ ప్రత్యేకతలు:

8.9 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 2048 x 1536పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఎన్-విడియా టెగ్రా కే1 (64-బిట్) ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, బూమ్ సౌండ్ స్పీకర్ టెక్నాలజీ, హెచ్‌టీసీ ట్రేడ్ మార్క్ డిజైన్. మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో గూగుల్ నెక్సుస్ 9 టాబ్లెట్ లభ్యం కానుంది. 16జీబి వేరియంట్ యూఎస్ మార్కెట్ ధర 399 డాలర్లు (భారత మారకం ప్రకారం రూ.24,440), 32జీబి వేరియంట్ ధర 479 డాలర్లు (భారత మారకం ప్రకారం రూ.29,219), ఎల్టీఈ ఆధారిత 32జీబి మోడల్ ధర 599 డాలర్లు (భారత మారకం ప్రకారం ఈ విలువ రూ.36,600). నవంబర్ 4 నుంచి ఈ డివైస్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. నెక్సుస్ 9 టాబ్లెట్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Google Announces a New Phone, Tablet, and Android ‘Lollipop’. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot