గూగుల్ నుంచి కొత్త ఫోన్‌లు లాంచ్ అయ్యాయ్! ఓ లుక్కేద్దాం రండి..

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ ఎట్టకేలకు తన లేటెస్ట్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసింది.

|

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ ఎట్టకేలకు తన లేటెస్ట్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసింది. న్యూయార్క్ వేదికగా కొద్ది గంటల క్రితం నిర్వహించిన గూగుల్ పిక్సల్ ఈవెంట్‌లో భాగంగా పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్‌లను గూగుల్ ఆవిష్కరించింది. స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని మరో లెవల్‌కు తీసుకువెళ్లే క్రమంలో బెస్ట్ క్వాలిటీ కెమెరాలను పిక్సల్ 3 డివైసెస్‌లో ఎక్విప్ చేసినట్లు గూగుల్ చీఫ్ రిక్ ఓస్టర్‌లోహ్ తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు ఎంతంటే?

అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు ఎంతంటే?

ధరల విషయానికి వచ్చేసరికి యూఎస్ మార్కెట్లో గూగుల్ పిక్సల్ 3 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 799 డాలర్లుగా ఉంటుంది. 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 899 డాలర్లుగా ఉంటుంది. ఇక పిక్సల్ 3 ఎక్స్ఎల్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌కు సంబంధించిన 64జీబి వేరియంట్ ధర 899 డాలర్లుగా ఉంటుంది, 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 999 డాలర్లుగా ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు అక్టోబర్ 11 నుంచి ప్రీ-ఆర్డర్ పై అందుబాటులో ఉంటాయి.ఈ ఫోన్ లను ముందస్తుగా బుక్ చేసుకునే వారికి 6 నెలల పాటు యూట్యూబ్ మ్యూజిక్ సర్వీస్ అందుబాటలో ఉంటుందని గూగుల్ తెలిపింది.

ఇండియన్ మార్కెట్లో వీటి ధరలు ఎంతంటే?

ఇండియన్ మార్కెట్లో వీటి ధరలు ఎంతంటే?

ఇక ఇండియన్ మార్కెట్లో గూగుల్ పిక్సల్ 3 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.71,000గా ఉంటుంది. 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.80,000గా ఉంటుంది. ఇక పిక్సల్ 3 ఎక్స్ఎల్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌కు సంబంధించిన 64జీబి వేరియంట్ ధర రూ.83,000గా ఉంటుంది, 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.92,000గా ఉంటుందని గూగుల్ తెలిపింది. నవంబర్ 1 నుంచి ఇవి ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి

 

 

పిక్సల్ 3 ప్రత్యేకతలు..
 

పిక్సల్ 3 ప్రత్యేకతలు..

5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే (విత్ 2960 x 1440 పిక్సల్స్), ఆండ్రాయిడ్ Pie ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 మొబైల్ ప్రాసెసర్ విత్ అడ్రినో 630 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12.2 డ్యుయల్ పిక్సల్ సింగిల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ డ్యుయల్ పిక్సల్ ఆటో ఫోకస్, 8 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫేసింగ్ కెమెరా, 2915 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, యాక్టివ్ ఎడ్జ్ సెన్సార్. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐపీ68 డస్ట్ ఇంకా వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్.

 

 

పిక్సల్ 3 ఎక్స్ఎల్ ప్రత్యేకతలు..

పిక్సల్ 3 ఎక్స్ఎల్ ప్రత్యేకతలు..

6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే (విత్ 2960 x 1440 పిక్సల్స్), ఆండ్రాయిడ్ Pie ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 మొబైల్ ప్రాసెసర్ విత్ అడ్రినో 630 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12.2 డ్యుయల్ పిక్సల్ సింగిల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ డ్యుయల్ పిక్సల్ ఆటో ఫోకస్, 8 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫేసింగ్ కెమెరా, 3430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, యాక్టివ్ ఎడ్జ్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐపీ68 డస్ట్ ఇంకా వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్.

 

 

Best Mobiles in India

English summary
Google finally unveils Pixel 3, 3XL with even better cameras.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X