భారత్ కోసం గూగుల్ రూ.2000 ఫోన్

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన భారత్ ప్యరటనలో భాగంగా తాను చదుకువున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా అక్కడి విద్యార్థులతో బేటీ అయిన ఆయన భారత్ కోసం గూగుల్ రూ.2,000 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

భారత్ కోసం గూగుల్ రూ.2000 ఫోన్

Read More : స్మార్ట్‌ఫోన్‌కు పెన్‌డ్రైవ్ కనెక్ట్ చేయటం ఎలా..?

డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌కు పూర్తిగా మద్దతు ప్రకటించిన గూగుల్, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగాన్ని మరింతగా పెంచేందుకు కృషిచేస్తుందని ఈ సందర్బంగా సుందర్ పిచాయ్ తెలిపారు. డిజిటల్ ఎకానమీలో భారత్ ప్రపంచ అగ్రగామీగా నిలవాలంటే చౌక ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావల్సి ఉందని పిచాయ్ అన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజిటల్ ప్రపంచంలో అనుసంధానమయ్యే క్రమంలో..

చౌక ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావటం వల్ల డిజిటల్ ప్రపంచంలో అనుసంధానమయ్యే భారతీయుల సంఖ్య మరింత పెరగుతుందని పిచాయ్ అభిప్రాయపడ్డారు. తన ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌లో భాగంగా గూగుల్ గతంలో మైక్రోమాక్స్, కార్బన్, స్పైస్ మొబైల్ తయారీ కంపెనీలతో జతకట్టి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది

గతంలో ఆండ్రాయిడ్ వన్..

రూ.6,000 రేంజ్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లు అప్పట్లో అంతగా కనెక్ట్ కాలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక హంగులతో గూగుల్ అందుబాటులోకి తీసురావాలనుకుంటున్న రూ.2,000 ఫోన్ మార్కెట్లో సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

 

అంచెలంచెలుగా ఎదిగిన సుందర్ పిచాయ్..

43 సంవత్సరాల సుందర్ పిచాయ్ గూగుల్ కంపెనీలో 2004లో చేరారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి గూగుల్ స్ధాయి ఎదిగారు. క్రియేటివిటీతో కూడిన ప్రొడక్ట్‌లను రూపొందించటంలో పిచాయ్ దిట్ట. గూగుల్‌కు మరో బ్రౌజర్ అవసరం ఉందన్న విషయాన్ని గుర్తించి గూగుల్ క్రోమ్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన భారతీయ మేధా సరస్వతి సుందర్ పిచాయ్ గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

CES 2017లో లాంచ్ అయిన కొత్త టెక్నాలజీ

అసలు పేరు పిచాయ్ సుందర్రాజన్

సుందర్ పిచాయ్ చెన్నైలో 1972లో జన్మించారు. అతని వయస్సు 43 సంవత్సరాలు. సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందర్రాజన్. సుందర్ పిచాయ్ గూగుల్ లో ప్రొడక్ట్ ఇంకా ఇన్నోవేషన్ అధికారిగా 2004లో నియమితులయ్యారు. సుందర్ పిచాయ్ గుర్తింపు పొందారు.

 

ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి...

సుందర్ పిచాయ్ తన బ్యాచిలర్ డిగ్రీని ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి పొందారు. సుందర్ పిచాయ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు.

3 నిమిషాల్లో 100జీబి డేటా డౌన్‌లోడ్

గూగుల్ ఆండ్రాయిడ్ అభివృద్ధిలో కీలక పాత్ర..

గూగుల్ ఆండ్రాయిడ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ జీమెయిల్ యాప్, గూగుల్ వీడియో కోడెక్ విభాగాలకు కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రోమ్ ఓఎస్ అలానే ఆండ్రాయిడ్ యాప్స్ అభివృద్థిలో సుందర్ పిచాయ్ కీలక పాత్ర పోషించినందుకుగాను గూగుల్‌లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

2011లో ట్విట్టర్ నుంచి ఆఫర్..

సుందర్ పిచాయ్‌కు 2011లో ట్విట్టర్ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే, 50 మిలియన్ డాలర్లను చెల్లించి గూగుల్ సుందర్ పిచాయ్ ను తమ వద్దే ఉంచేసుకుంది. సుందర్ పిచాయ్‌కు 2011లో ట్విట్టర్ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే, 50 మిలియన్ డాలర్లను చెల్లించి గూగుల్ సుందర్ పిచాయ్‌ను తమ వద్దే ఉంచేసుకుంది. ప్రస్తుతం సుందర్ పిచార్ గూగుల్ సీఈఓగా కొనసాగుతున్నారు.. 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Is Working On A Rs 2000 Android Phone For India!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot