మార్కెట్లోకి గూగుల్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్

Posted By:

మొబైల్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ల విభాగంలో అంతర్జాతీయంగా అత్యధిక శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకున్న ఆండ్రాయిడ్ (గూగుల్ కంపెనీ తయారీ) తనదైన వ్యూహాలతో ముందుకుసాగుతోంది.
 

మార్కెట్లోకి గూగుల్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్

తాజాగా గూగుల్ ‘ఆండ్రాయిడ్ వన్' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఆండ్రాయిడ్ వన్  ఫోన్‌లను ప్రస్తుతం మైక్రోమాక్స్, కార్బన్, స్పైస్ సంస్థలు కాన్వాస్ ఏ1 (ధర రూ.6,499), స్పార్కిల్ వీ (ధర 6,399), డ్రీమ్యూనో మి-498 (ధర రూ.6299) మోడల్స్‌లో అందిస్తున్నాయి. వీటిని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లైన అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌తో పాటు రిలయన్స్ డిజిటల్, క్రోమా, ది మొబైల్ స్టోర్ తదితర విక్రయాశాలల వద్ద కొనుగోలు చేయవచ్చు.

మార్కెట్లోకి గూగుల్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్

సమీప భవిష్యత్‌లో ఏసర్, ఆల్కాటెల్, జోలో, హెచ్‌టీసీ, లావా, ఇంటెక్స్, ఆసుస్, లెనోవో వంటి కంపెనీల ద్వారా ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తామని గూగుల్ సీనియర్ ఉపాధ్యక్షుడు సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రస్తుతం లభ్యమవుతోన్న ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లు మీడియాటెక్ చిప్‌సెట్‌ల పై రన్ అవుతున్నాయి.

మార్కెట్లోకి గూగుల్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్

భవిష్యత్‌లో విడుదల చేసే ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లలో క్వాల్కమ్ చిప్‌సెట్‌లను వినియోగిస్తామని సందుర్ పిచాయ్ తెలిపారు. ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల కోసం గూగుల్ కొత్తగా న్యూస్టాండ్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా 30 వార్తాపత్రికలతో పాటు మ్యాగజైన్లను డిజిటల్ వర్షన్‌లో చదువుకోవచ్చు. 7 ప్రాంతీయ భాషలను ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లు సపోర్ట్ చేస్తాయి.

మార్కెట్లోకి గూగుల్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్

ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లు ప్రస్తుతం ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తున్నాయి. త్వరలోనే వీటికి ఆండ్రాయిడ్ ఎల్ అప్‌డేట్ అందుతుంది. ఇతర ప్రత్యేకతలు... 4.5 అంగుళాల టచ్ స్ర్కీన్, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Google Launches Android One Phone. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot