Home
Mobile

గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగిస్తున్నారా.. మీ ఆందోళనకు చెక్ పెట్టేలా కొత్త ఫీచర్‌ రాబోతుంది..!!

గూగుల్ మ్యాప్స్‌లో గోప్యత గురించి ఆందోళన చెందే వారికి సంస్థ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గూగుల్ క్లౌడ్‌ లో ప్రైవసీ సమస్యలు కారణంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గోప్యత నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొంది. గూగుల్‌ మ్యాప్స్‌ (Google Maps Privacy Update) డేటాను ఇప్పటి వరకు క్లౌడ్‌లో భద్రపరచగా... త్వరలో యూజర్ల మొబైల్‌ లోనే భద్రపరచనున్నట్లు పేర్కొంది. దీంతోపాటు గూగుల్‌ లోకేషన్‌ హిస్టరీని ' టైమ్‌ లైన్‌ ' గా పేరు మారుస్తున్నట్లు తెలిపింది.

గూగుల్‌ మ్యాప్స్‌ ప్రైవసీ నిబంధనలు ఈ సంవత్సరం డిసెంబర్‌ నుంచి అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. దీనిపై యూజర్ల కు గూగుల్‌ ఈ- మెయిల్‌ పంపింది. పాత ప్రయాణాలకు సంబంధించిన డేటాను యూజర్ల మొబైళ్లలో భద్రపరిచేందుకు కేవలం డిసెంబర్‌ 1 వరకు మాత్రమే సమయం ఉందని తెలిపింది. అనంతరం పాత డేటాను తొలగించడం ప్రారంభం అవుతుందని పేర్కొంది.

google maps privacy news that will stop location history soon

ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ మరియు iOS వెర్షన్‌ గూగుల్‌ మ్యాప్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని, వెబ్‌ వెర్షన్‌లో ప్రస్తుతం అందుబాటులో లేదని తెలుస్తోంది. వెబ్‌ ఇంటర్‌ఫేజ్‌ ద్వారా యూజర్లు వారి లోకేషన్‌ హిస్టరీని తెలుసుకోవచ్చు. అయితే వెబ్‌ వెర్షన్‌లో ఈ ఫీచర్‌ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అందువల్ల వెబ్‌, మొబైల్‌ మధ్య లోకేషన్‌ డేటా సింక్‌ అయ్యేందుకు అవకాశం లేదు. యూజర్ల మొబైల్‌ లోని డేటాకు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సదుపాయం ఉంటుందని తెలుస్తోంది.

** గూగుల్‌ మ్యాప్స్‌ లో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్‌ ల వివరాలు అందించనున్నట్లు ఏప్రిల్‌ నెలలో గూగుల్‌ తెలిపింది. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో దూర ప్రయాణాలు చేసే వారికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి సమీపంలోని ఛార్జింగ్‌ స్టేషన్ల వివరాలను అందించనుంది.

గూగుల్‌ మ్యాప్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ( AI ) ఆధారిత ఫీచర్‌ ద్వారా సమీపంలోని ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ వివరాలను అందిస్తుంది. రియల్‌ టైం డేటా ఆధారంగా ఆటోమేటిక్‌ గానే ఈ వివరాలను మ్యాప్స్‌లో కనిపించనున్నాయి. ఛార్జింగ్‌ స్పీడ్‌ సహా ఛార్జింగ్‌ పోర్టు లభ్యత వివరాలను అందించనుంది.

ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌ మ్యాప్స్‌ ఈ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అయితే తొలుత గూగుల్‌ బిల్ట్‌ ఇన్ ఉన్న వాహనాలకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుందని సంస్థ వెల్లడించింది. రోడ్‌ ట్రిప్‌లు సహా ఇతర ప్రయాణాలు చేసే వారికి ఈ ఫీచర్‌ ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
google maps will not save your history on cloud soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X