ఇండియన్ మార్కెట్లోకి గూగుల్ నెక్సూస్ 7 టాబ్లెట్, నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్!!

|

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్.. అసూస్, ఎల్‌జీ కంపెనీలతో జతకట్టి రూపొందించిన నెక్సూస్ 7 (టాబ్లెట్), నెక్సూస్ 5 (స్మార్ట్‌పోన్)లు బుధవారం నుంచి ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. గూగుల్ ప్లేస్టోర్ వీటిని విక్రయిస్తోంది . ఆర్డర్ చేసుకున్న వారికి గూగుల్ ప్లే స్లోర్ 2 నుంచి 7 రోజుల్లో డివైజ్‌లను డెలివరీ చేస్తుంది. నెక్సూస్ 7 (2103 ఎడిషన్) టాబ్లెట్‌ను 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో పొందవచ్చు. 16జీబి వై-ఫై వర్షన్ ధర రూ.20,999, 32జీబి వై-పై వర్షన్ ధర రూ.23,999, 32జీబి ఎల్టీఈ వర్షన్ ధర రూ.27,999. మరోవైపు, నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను 16, 32జీబి మెమరీ వేరియంట్‌లలో పొందవచ్చు. 16జీబి వర్షన్ ధర రూ.28,999. 32జీబి వర్షన్ ధర రూ.32,999.

 
మార్కెట్లోకి గూగుల్ నెక్సూస్ 7 టాబ్లెట్,  నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్

గూగుల్ నెక్సూస్ 5 ప్రధాన ఫీచర్లు:

ఫోన్ పరిమాణం 69.17x137.84x8.59మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు, 4.95 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే (445 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్‌వేగం 2.3గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (17 గంటల టాక్‌టైమ్, 300 గంటల స్టాండ్‌బై టైమ్). కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ బ్యాండ్ వై-ఫై (24జీ/5జీ), 3జీ/4జీ ఎల్టీఈ ఇంకా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఆండ్రాయిడ్ బీమ్), వైర్ లెస్ ఛార్జింగ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

గూగుల్ నెక్సూస్ 7 (2013 ఎడిషన్) కీలక ఫీచర్లు:

7.02 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (323 పీపీఐ), స్ర్కాచ్ రెసిస్టెంట్ కార్నింగ్ గ్లాస్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్), అడ్రినో 320 గ్రాఫిక్ ఫీచర్, 2జీబి ర్యామ్, 3950ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు: బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్, జీపీఎస్, గ్లోనాస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, హెచ్‌డిఎమ్ఐ అవుట్ పుట్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X