గూగుల్ పిక్సల్ 10 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. సంవత్సరాల పాటు మన్నిక వచ్చేలా..!
Google Pixel 10 pro Fold Smartphone : గూగుల్ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పిక్సల్ 10 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. మేడ్ బై గూగుల్ ఈవెంట్ లో గూగుల్ పిక్సల్ 10 సిరీస్‌లో భాగంగా ఫోల్డ్ మోడల్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ ఫోన్ ఏకంగా 10 సంవత్సరాల వరకు మన్నిక ఉంటుందని గూగుల్ చెబుతోంది. ఈ గూగుల్ పిక్సల్ 10 ప్రో ఫోల్డ్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
గూగుల్ పిక్సల్ 10 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.4 అంగుళాల OLED కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 8.0 అంగుళాల OLED ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు డిస్‌ప్లే లు 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. కలర్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ను పొందుతుంది.

ఈ గూగుల్ బుక్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ టెన్సార్ G5 చిప్‌సెట్ ( Tensor G5 Chip ) ను కలిగి ఉంది. మరియు టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 16GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది.
7 సంవత్సరాల అప్‌డేట్స్, 5015mAh బ్యాటరీ :
పిక్సల్ 10 ప్రో ఫోల్డ్ ఫోన్ 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది. ఈ ఫోన్ 30W వైర్ ఛార్జింగ్, 15W Qi2 వైర్‌లైస్ ఛార్జింగ్ సపోర్టుతో 5015mAh బ్యాటరీని కలిగి ఉంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 10.5MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు OIS, 5x జూమ్ సామర్థ్యంతో 10.8MP టెలిఫోటో లెన్స్ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడీయో కాల్స్ కోసం 10MP కెమెరాను అమర్చారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
ఈ కెమెరాల ద్వారా 60fps తో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఈ ఫోన్ జెమిని నానో, జెమిని లైవ్, జెమిని యాప్స్, మేజిక్ క్యూ, సర్కిల్ టూ సెర్చ్, పిక్సల్ స్క్రీన్‌షాట్స్ వంటి అనేక ఫీచర్లను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.
గూగుల్ పిక్సల్ 10 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు :
ఈ ఫోన్ 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,72,999 గా ఉంది. మూన్‌స్టోన్ కలర్ వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. సేల్ తేదీ సహా ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








